Madhuri Dixit Nene Trolling.. ఆమె వయసు 59 సంవత్సరాలు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా కుర్ర హృదయాల్లో తన అందంతో ప్రకంపనలు సృష్టించిందామె.!
పరిచయం అక్కర్లేని పేరది. మాధురీ దీక్షిత్.. బాలీవుడ్ సినిమాలతో, దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న నటి మాధురీ దీక్షిత్ గురించి కొత్తగా పరిచయం చేయాలా.?
అవసరం లేదు.! ఆరు పదుల వయసులోకి ఎంటర్ అవుతున్నా, వన్నె తరగని అందం మాధురీ దీక్షిత్ సొంతం. ఔను, వయసుతోపాటు మాధురీ దీక్షిత్ అందమూ పెరుగుతోంది.
ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.. అనడానికి, మాధురీ దీక్షిత్‌ని నిలవెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చేమో. సరే, మాధురీ దీక్షిత్ గురించి, అభిమానులు గుప్పించే ఈ పొగడ్తలు సర్వసాధారణమే.
Madhuri Dixit Nene Trolling.. అసభ్యకరమైన ఫొటోల్ని వైరల్ చేస్తున్నారు..
అసలు విషయమేంటంటే, మాధురీ దీక్షిత్ అత్యంత అవమానకరమైన రీతిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురవుతోంది.
దీన్ని ట్రోలింగ్ అనాలా.? మార్ఫింగ్ పైత్యం అనాలా.? పేరు ఏదైనా కావొచ్చుగాక. మాధురీ దీక్షిత్ ఫొటోలు కొన్ని మార్ఫింగ్ చేసినవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలా ఇలా కాదు, అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన ఫొటోల్ని కొందరు పనిగట్టుకుని వైరల్ చేస్తున్నారు. ఈ వైరల్ ఫొటోలపై మాధురీ దీక్షిత్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇంతవరకు మాధురీ దీక్షిత్ ఈ వల్గర్ ఫొటోలపై స్పందించలేదు. కొన్నాళ్ళ క్రితం మాధురీ దీక్షిత్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది.
ఆ ఫొటోల్నే ఇక్కడ మీరు చూస్తున్నది. కానీ, ఈ ఫొటోల్ని మార్ఫింగ్ చేసి, అత్యంత జుగుప్సాకరంగా వాటిని తయారు చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.
అభిమానులు గుస్సా అవుతున్నారు..
మాధురీ దీక్షిత్ ఇంతవరకు ఈ వ్యవహారంపై స్పందించకపోయినా, ఆమె అభిమానులు మాత్రం, వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అయినా, మాధురీ దీక్షిత్ ఏమంత పెద్ద పాపం చేసిందని.? ఎక్కడా ఏ విషయమ్మీదా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. పెళ్ళయ్యాక లో-ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తోంది.
మొన్నీమధ్యనే ఓ వెబ్ సిరీస్‌లో కనిపించింది మాధురీ దీక్షిత్. అడపా దడపా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తుంటుంది. చూస్తున్నారు కదా.. ఇవీ, ఆమె అధికారిక హ్యాండిల్ నుంచి వచ్చినవే.
Also Read:
ట్రోలింగ్ అనేది కొందరికి ఓ వ్యసనంలా మారిపోయింది. సభ్య సమాజానికి హానికరంగా మారింది ఈ మార్ఫింగ్ ఫొటోలతో ట్రోలింగ్ వ్యవహారం.
సైబర్ క్రైమ్స్‌ని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎంతలా ఉక్కుపాదం మోపుతున్నా, కుప్పలు తెప్పలుగా నేరగాళ్ళు పుట్టుకొస్తూనే వున్నారు.
