Home » ‘మండాడి’ రివ్యూ: సూరి, సుహాస్.. నటనలో నువ్వా నేనా.!?

‘మండాడి’ రివ్యూ: సూరి, సుహాస్.. నటనలో నువ్వా నేనా.!?

by Mudra369 Editorial Desk
0 comments
Mandaadi Review

Mandaadi Telugu Review.. సూరి అంటే, తమిళ సినిమాల్లో కమెడియన్‌గా, చిన్నా చితకా పాత్రల్లో కనిపించేవాడు ఒకప్పుడు.!

సుహాస్ తెలుసు కదా.? చిన్నా చితకా పాత్రలతోనే కెరీర్ ప్రారంభించి, నటుడిగా ఓ స్థాయికి ఎదిగాడు.

ఇటు సుహాస్, అటు సూరి.. ఇద్దరూ కలిసి ‘మండాడి’ అనే సినిమాలో నటించారు. సూరి గతంలో చేసిన ‘విడుదలై’ నటుడిగా, అతనికి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది.

తమిళనాట, సూరి సినిమా అంటే, విపరీతమైన క్రేజ్ వుందిప్పుడు. అలా ‘మండాడి’ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయ్ సినిమా రిలీజ్‌కి ముందు.

ప్రోమోస్ సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగులు జరిగాయి ‘మండాడి’ సినిమాకి.

Mandaadi Telugu Review.. కథా కమామిషు ఇదీ..

ఓ సముద్ర తీర ప్రాంతం. అక్కడి పడవ పోటీలు ఫేమస్. ఒకే జట్టుకి ఆడిన ఇద్దరు స్నేహితులు, బద్ధ విరోదులైతే.. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది.? అన్నది తెరపై చూడాల్సిందే.

సింపుల్‌గా చెప్పుకోవాలంటే కథ ఇదే.! దర్శకుడు, కథని పక్కాగా రాసుకున్నాడు.. సన్నివేశాల్ని ఇంకా బాగా రాసుకున్నాడు. అంతకన్నా బాగా తెరకెక్కించాడు కూడా.

లీడ్ రోల్స్‌లో కనిపించిన సూరి, సుహాస్.. ఇద్దరూ చాలామంచి నటులు కావడంతో దర్శకుడికి పని తేలికైపోయింది. నట విశ్వరూపం.. అనొచ్చేమో సూరి, సుహాస్‌లది.

గెటప్స్ దగ్గర్నుంచి, వారి వారి పాత్రల్లో అటు సూరి, ఇటు సుహాస్ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. పడవ పోటీలకు గురువు పాత్రలో సత్యరాజ్ తన అనుభవాన్ని రంగరించారు.

హీరోయిన్ మహిమా నంబియార్‌కి చెప్పుకోదగ్గ పాత్రే లభించింది. అయితే, ఆమెని ఇంకాస్త బాగా వాడుకుని వుండాల్సింది.

ఇలాంటి సినిమాలకి టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ నుంచి దర్శకుడికి ఎక్కువ సహకారం అవసరం. ఆ సహకారం దర్శకుడికి బాగానే లభించింది.

సినిమాటోగ్రఫార్ కదిర్ విజువల్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రాఫర్‌తో పోటీ పడ్డాడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. అటు పాటలు, ఇటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. రెండూ చాలా బావున్నాయ్.

Also Read: బ్యాగు.! బాగు.! వందలు, వేలల్లో కాదు, లక్షల్లో రేటు.. హీటు.!

ఎడిటింగ్ కూడా చాలా బావుందిగానీ, సెకెండాఫ్ విషయంలో ఎడిటర్ ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి వుండాల్సింది. సాగతీత సన్నివేశాలపై నిర్దాక్షిణ్యంగా కత్తెర వేటు వేసి వుండాల్సింది.

యాక్షన్ ఎపిసోడ్స్ అయితే వేరే లెవల్.! స్టంట్ కొరియోగ్రఫీని ప్రత్యేకంగా అభినందించాలి. పడవ పోటీల విషయంలో సినిమాటోగ్రాఫర్, స్టంట్ కొరియోగ్రాఫర్.. మ్యూజిక్ డైరెక్టర్ పోటీ పడ్డారంతే.

సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఎక్కడా అస్సలు రాజీ పడలేదు.

అయితే, పడవ పోటీల పరమార్థమేంటి.? అన్నది కొంత అయోమయంగా అనిపిస్తుంది. ఒకట్రెండు మైనస్ పాయింట్స్ పక్కన పెడితే, ఓవరాల్‌గా ‘మండాడి’ మంచి సినిమా.

ఓవరాల్‌గా చెప్పాలంటే, ఆ విజువల్స్.. లీడ్ యాక్టర్స్ నటనా ప్రతిభ.. ఇవన్నీ ప్రేక్షకుడ్ని థియేటర్లో బలంగానే కూర్చోబెడతాయి. సన్నివేశాల్లోని ఎమోషన్స్‌తో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

సూరి పాత్రకి దర్శకుడు ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. సుహాస్‌కి ఇదే తొలి సినిమా. సుహాస్‌ని ఆల్రెడీ తమిళ ఆడియన్స్ ‘ఓన్’ చేసేసుకున్నారు.

‘మండాడి’ సినిమాతో సూరికి తెలుగులో కూడా మార్కెట్ పెరుగుతుందన్నది నిర్వివాదాంశం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group