Table of Contents
Vaibhav Sooryavanshi IPL Earnings.. చాలా చిన్న కుర్రోడు.. ఔటైపోయితే, ఏడుస్తున్నాడు.! మ్యాచ్ ఓడిపోతే, ఏడ్చేస్తున్నాడు.!
ఔను, ఏడుస్తాడు.. ఎందుకంటే, క్రికెట్ మీద అతనికున్న ప్రేమ అలాంటిది.
మైదానంలో ప్రత్యర్థి బౌలర్ ఎవరైనాసరే, విరుచుకుపడిపోతాడీ చిచ్చరపిడుగు. పేరు తెలుసు కదా, వైభవ్ సూర్యవంశీ. వయసు జస్ట్ పదిహేనేళ్ళు మాత్రమే.
అలా ఎలా కొట్టేస్తున్నాడబ్బా.? అని, తలపండిన క్రికెట్ విశ్లేషకులు సైతం జుట్టు పీక్కుంటున్నారు వైభవ్ సూర్యవంశీ ఆట తీరుని చూసి.
2026 ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు వైభవ్ సూర్యవంశీవే. అంతే కాదు, అత్యధిక సిక్సులు బాదింది కూడా వైభవ్ సూర్యవంశీనే.
Vaibhav Sooryavanshi IPL Earnings.. చిన్నోడి సంపాదన ఎంతో తెలుసా.?
ఇంతకీ, ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తంగా ఎంత సంపాదించి వుంటాడు.? అంటే, అన్ని లెక్కలూ వేసుకుంటే, దాదాపు మూడు కోట్లు సంపాదించాడని తేలింది.
అధికారిక లెక్క ప్రకారం మూడు కోట్లు.. అనధికారికంగా, అంటే, ఆ లెక్కలు వేరే మళ్ళీ. వైభవ్ సూర్యవంశీ అంటే, ఇప్పుడు జస్ట్ పేరు మాత్రమే కాదు, బ్రాండ్.
ఇండియన్ క్రికెట్‌లో సరికొత్త స్టార్ క్రికెటర్‌గా అవతరించేశాడు వైభవ్ సూర్యవంశీ. త్వరగా, అంతర్జాతీయ జట్టులో ఆడించెయ్యండి.. అంటూ, వైభవ్ తరఫున అతని అభిమానులు కోరుతున్నారు.
కానీ, వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. దానికి, వయసు కొంత అడ్డంకిగా మారుతోంది.
వైభవ్ సూర్యవంశీ.. ఇకపై బ్రాండ్.!
ఈలోగా వైభవ్ సూర్యవంశీ స్వేచ్ఛగా కమర్షియల్ యాడ్స్‌లో నటించేయొచ్చు.. బ్రాండ్ అంబాసిడర్‌గా సంచలనాలు సృష్టించేయొచ్చు.
పది కోట్లు, పాతిక కోట్ల సంపాదన.. చాలా చాలా చిన్న విషయం ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి. సరైన బ్రాండ్స్ తగిలాయంటే, వంద కోట్ల మార్క్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదేమో.
అయితే, ప్రస్తుతానికి వైభవ్ సూర్యవంశీ పూర్తిగా ఆట మీదనే ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్‌లోనే అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొన్నప్పటికీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల పరిస్థితి భిన్నమంటున్నాడీ చిచ్చరపిడుగు.
సంచలనం సూర్యవంశీ..
ఒక్కటి మాత్రం నిజం.. ఇండియన్ క్రికెట్‌లోకి సంచలనంలా చాలామంది క్రికెటర్లు దూసుకొచ్చారు గతంలో.. ఇకపైనా దూసుకొస్తూనే వుంటారు.
వైభవ్ సూర్యవంశీ కూడా ఆ లిస్టులో ఒకడు. ఐపీఎల్‌లో మెరిసి, అంతర్జాతీయ క్రికెట్‌లో చేతులెత్తేసిన క్రికెటర్లనూ చూశాం. ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి, అధ్భుతాలు సృష్టించిన ఆటగాళ్ళనీ చూశాం.
ఆల్ ది బెస్ట్ వైభవ్ సూర్యవంశీ.! నీ భవిష్యత్, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సంచలనంగానే మారాలి.
