Madonna Sebastian Sea Beauty.. ‘ప్రేమమ్’ సినిమాలో సివరాఖరిలో వచ్చి హీరోని పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటించి మెప్పించిన బ్యూటీ మడోనా సెబాస్టియన్.
చిన్నతనం నుంచీ హీరోని వన్ సైడ్‌లో ప్రేమించే అమ్మాయిగా ఆ పాత్రలో చాలా నేచురల్‌గా నటించింది మడోనా సెబాస్టియన్.
కేవలం నటన మాత్రమే కాదు చాలానే ఇతరత్రా కళలున్నాయ్ ఈ మలయాళ కుట్టీలో. చదువుకునే రోజుల్లోంచే అనేక కళల పట్ల ఆసక్తి చూపించింది మడోనా సెబాస్టియన్.
Madonna Sebastian Sea Beauty.. చిన్నతనం నుంచే ‘కళా’ రాణి.!
స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొనేదట. ఆ ఆసక్తే ఆమెను సినీ రంగం వైపు ఆకర్షించినట్లుంది కాబోలు. నటనతో పాటూ సింగర్‌గానూ టాలెంట్ చూపిస్తుంటుంది ఛాన్స్ వచ్చినప్పుడల్లా.
హీరోయిన్గా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటుంది.చిన్న పాత్రే అయినా తన పాత్రకు ఇంపార్టెన్స్ వుండేలా చూసుకోవడమే మడోనా సెబాస్టియన్ స్పెషాలిటీ.

అలాగే గ్లామర్లోనూ అమ్మడు తక్కువేం కాదు. అలా అని విచ్చలవిడిగా అందాలు ప్రదర్శించడం కూడా అస్సలు ఇష్టపడదు.
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్‌లో బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ వున్న మడోనా సెబాస్టియన్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ్.
బీచ్ సొగసుల్..
ప్రకృతి అంటే ముఖ్యంగా బీచ్ అంటే తనకు చాలా ఇష్టమనీ, టైమ్ దొరికినప్పుడల్లా ఇలా బీచ్ అందాల్ని ఆస్వాదిస్తూ వుంటానని మడోనా సెబాస్టియన్ చెప్పుకొచ్చింది.
ఆ మాటకొస్తే.. బీచ్ అంటే ఇష్టపడని వాళ్లెవరుంటారు చెప్పండి. అందులోనూ చక్కనమ్మలు.! అంతేగా.! అంతేగా.!

అన్నట్లు మడోనా సెబాస్టియన్ మలయాళ సినిమాలు అలాగే తమిళ సినిమాలతోపాటూ, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన సంగతి తెలిసిందే.
నాగచైతన్యతో తెలుగులో ‘ప్రేమమ్’ సినిమాలో నటించిందీ బ్యూటీ. పాటలే కాదు, మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ప్రావీణ్యం వుంది మడోన్నా సెబాస్టియన్‌కి.
ప్రబాస్ హీరోగా వస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో మడోనా సెబాస్టియన్ ఓ సర్ప్రైజింగ్ రోల్ పోషించనుందని సమాచారమ్.
