Madonna Sebastian Tollywood.. అందగత్తెలు పాటగత్తెలుగా మారితే.! ఆ కోవలో మనకు ఠక్కున గుర్తొచ్చే ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్. మంచి నటిగా, సింగర్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది మమతా మోహన్ దాస్.
అలాగే, మలయాళ ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్ కూడా. ఆకర్షించే అందమైన నటన మాత్రమే కాదు, సింగింగ్ టాలెంట్‌తోనూ ఆకట్టుకుంటోంది.
అప్పుడెప్పుడో నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాలో సివరాఖరున వచ్చి, నాగ చైతన్య మనసు దోచుకున్న ముద్దుగుమ్మే మడోనా సెబాస్టియన్.
Madonna Sebastian Tollywood.. అందగత్తె.. పాటగత్తె..!
తెలుగులో చేసిన సినిమాలు రెండే రెండు. కానీ, ఈ టాలెంటెడ్ బ్యూటీని బాగానే గుర్తు పెట్టేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు.
అప్పుడెప్పుడో ‘ప్రేమమ్’ సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ, తర్వాత సాయి పల్లవి, నాని జంటగా తెరకెక్కిన హిట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’లో ఓ ఇంపార్టెంట్ రోల్ పోపించింది.

ఇక, అంతే తెలుగులో ఇక చేసింది లేదు. కానీ, మలయాళ, తమిళ తదితర భాషల్లో మడోనా (Madonna Sebastian) పలు చిత్రాల్లో నటించింది.
అన్నట్లు మడోనా సెబాస్టియన్ కేవలం నటి మాత్రమే కాదండోయ్. సింగర్ కూడా. చిన్నతనం నుంచీ సింగింగ్ అంటే చాలా ఇష్టమట.
ఓటీటీలోనూ టాలెంట్ చూపిస్తోందిగా.!
ఆ ఇష్టంతోనే మ్యూజిక్ నేర్చుకుంది. మలయాళంలో కొన్ని సినిమాలకు మ్యూజిక్ పరంగా మడోనా సెబాస్టియన్ (Madonna Sebastian) సపోర్ట్ చేసింది కూడా.

పలు టెలివిజన్ మ్యూజిక్ ప్రొగ్రాంస్‌లో పాల్గొని, తనదైన మ్యూజిక్ టాలెంట్‌ని కనబరిచిందీ సింగర్ కమ్ యాక్ర్టెస్ మడోనా (Madonna Sebastian).
ప్రొషిషనల్ సింగర్ కావడంతో పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటూ, సినిమాల్లోనూ పాటలు పాడేసింది మడోనా సెబాస్టియన్.
Also Read: Ketika Sharma.. పవన్ కళ్యాణ్‌తో ఆ ఐదు నిమిషాలు.!
ప్రస్తుతం ఓ వైపు యాక్టింగ్ కంటిన్యూ చేస్తూనే తనకిష్టమైన మ్యూజిక్‌లోనూ సత్తా చాటుతోందీ మలర్ బ్యూటీ మడోనా. తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతోన్న ‘లియో’ సినిమాలో మడోనా నటిస్తోంది.

లేటెస్ట్‌గా కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. ‘యాంగర్ టేల్స్’ అనే వెబ్ సిరీస్‌లో మడోనా సెబాస్టియన్ నటనకు ఓటీటీ జనం ఫిదా అయ్యారు.