Maheshbabu Guntur Kaaram Maasss.. మహేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అంటే ఎలా వుండాలి.? ఆ హంగామా అయితే, కనిపించాల్సిన స్థాయిలో కనిపించడంలేదాయె.!
మొన్నామధ్యన ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తే, అది కాస్తా చాలా చాలా చప్పగా సాగింది. చాలా విమర్శలొచ్చాయ్. లిరిక్ రైటర్ చాలా ఫీలయ్యి, ట్వీటు జారాడు.!
దాంతో, లిరిక్ రైటర్ మీదా, నిర్మాణ సంస్థ మీదా మహేష్ అభిమానులే గుస్సా అయ్యారు.!
Maheshbabu Guntur Kaaram Maasss.. ఈసారి లెక్క మారిపోయింది.!
కానీ, ఈసారి లెక్క మారిపోయింది. తాజాగా, ఓ మాస్ నంబర్‌కి సంబంధించిన స్టిల్‌ని ‘గుంటూరు కారం’ టీమ్ విడుదల చేసింది.
సూపర్ స్టార్ మహేష్‌బాబు, శ్రీలీల.. ఇద్దరూ చితక్కొట్టేశారట.! ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ వెల్లడించింది.
పాట ఎలా వుంటుందోగానీ, స్టిల్ మాత్రం అదిరిపోయింది.! ఇది కదా.. ఇలాక్కదా వుండాల్సింది.. అనే స్థాయిలో స్టిల్ మహేష్ అభిమానుల్ని అలరిస్తోంది.
సంక్రాంతికి ఈ ‘గుంటూరు కారం’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శ్రీలీలతోపాటు మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మరో హీరోయిన్.!