Maheshbabu.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు ఆల్రెడీ ‘సినిమా యాపారం’లో బిజీగా వున్నాడు. సినిమాల్ని నిర్మిస్తున్నాడు.. ఆ సినిమాల్ని ప్రదర్శించే థియేటర్ల ఛెయిన్‌లో భాగస్వామ్యం కలిగి వున్నాడు.!
అయినా, సినిమా యాక్టర్లు వ్యాపారాలు చేసుకుంటే తప్పేంటి.? తప్పేమీ లేదు. ఈ మధ్యనే మహేష్‌బాబు ఇంకో వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. అది తిండి యాపారం.!
ఓ రెస్టారెంట్ ఛెయిన్‌తో కలిసి ముందడుగు వేశాడు. మహేష్ సతీమణి నమ్రత, వేరొక వ్యాపార భాగస్వామితో కలిసి ఈ రెస్టారెంట్‌ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Maheshbabu ఇడ్లీ.. అదిరిపోద్ది.!
మహేష్ సతీమణి నమ్రత నిర్వహిస్తోన్న ఈ రెస్టారెంటులో ఇడ్లీ ధర ఎంతో తెలుసా.? జస్ట్ 90 రూపాయలు మాత్రమే. దానికి, నెయ్యి.. అలాగే కారం జోడిస్తే.. ఆ ధర 120 రూపాయలట.!
మినపట్టు.. అదేనండీ దోశ తీసుకోండి.. ఇంకేదన్నా ట్రై చేయండి.. పర్సు ఖాళీ అయిపోవడం ఖాయం. ఇది మరీ టూమచ్.!
ఏంటి మహేషూ.. మరీ ఇంతలా దోచేస్తోంది మీ ఆవిడ.? అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు సెటైర్లేస్తున్నారు.
తప్పేముంది.? తిండి అంటేనే దోపిడీ కదా.?
ఇంటి పక్కనే ఇడ్లీ బండి దగ్గరకు వెళితే పది రూపాయలకే రెండు మూడు ఇడ్లీలొస్తాయ్. అక్కడికే వెళ్ళి తినొచ్చు కదా.? అంటే, అక్కడ శుచి, శుభ్రత మీద డౌటు.

అద్గదీ అసలు సంగతి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ధరలు ఇలాగే తగలడ్తాయ్.! అంతెందుకు, సాధారణ థియేటర్లకీ, మల్టీప్లెక్స్ థియేటర్లకీ.. టిక్కెట్ ధరలో తేడా వుండట్లేదా.?
ఆ మాటకొస్తే, చిన్న సినిమాలకు తక్కువ ధర.. పెద్ద సినిమాలకు ఎక్కువ ధర.. అంటూ టిక్కెట్ల పేరుతో దోచేస్తున్నారు. ఆ దోపిడీ సినిమాల లిస్టులో మహేష్ సినిమాలూ వుంటాయ్.
Also Read: Rashmi Gautam.. తెలుగు తంటా.! ఎందుకోస‘మంట’.!
అయినా, మహేష్ భార్య నమ్రత నిర్వహిస్తోన్న రెస్టారెంట్.. ఓ ప్రముఖ రెస్టారెంట్స్ ఛెయిన్‌లోనిది. ఆ సంస్థకు చెందిన అన్ని బ్రాంచీల్లోనూ అవే రేట్లు. ఇందులో మహేష్ దోపిడీ ఏముంది.?
ఒక్కో సినిమాకీ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటే మాత్రం.. యాపారమిది.! లాభాల కోసమే కదా ఏం చేసినా.? అయినా, సంపాదించిన సొమ్ముతో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు కదా.?
పసి పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నాడంటే దేవుడే మరి.! అది కూడా పబ్లిసిటీ స్టంటేనంటారా.? అయితే, అది మీ ఇష్టం.. మీరెలాగైనా అనుకోండి.!