‘ఆస్కార్’ నాటు: అప్పడు చరణ్.. ఇప్పుడు దీపిక.!

Ram Charan Deepika Padukone RRR Movie Oscars Naatu Naatu

Oscars Naatu DeepikaPadukone RamCharan ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ పురస్కారం దక్కింది. ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటని ప్రదర్శించారు.

లైవ్ ప్రదర్శన ఇచ్చింది ఒరిజినల్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ. కానీ, డాన్స్ చేసింది మాత్రం వేరే డాన్సర్స్. చరణ్, ఎన్టీయార్ (NTR Goes Global) డాన్స్ చేసి వుండాల్సింది.

కాగా, ఈ మొత్తం వ్యవహారాన్ని దీపికా పడుకొనే (Deepika Padukone) చేతుల మీదుగా నడిపించారు ఆస్కార్ నిర్వాహకులు.

దీపిక నోట.. చరణ్ మాట..

రామ్ చరణ్ (Global Star Ram Charan) ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో, ‘డూ యూ నో నాటు.?’ అంటూ ప్రశ్నిస్తాడు. అక్కడి నుంచే ఆ పాట మొదలవుతుంది.

అదే మాట.. ‘డూ యూ నో నాటు.?’ అంటూ ఆస్కార్ వేదికపై దీపిక పడుకొనే (Deepika Padukone) ప్రశ్నించింది. దాంతో ఒక్కసారిగా ఆడిటోరియం మార్మోగిపోయింది.

Also Read: నేను కాదు, నా భారత దేశం.! ఎన్టీయార్ దేశభక్తి.!

కాగా, ‘ఆస్కార్’ వేడుకలో రామ్ చరణ్, దీపిక పడుకొనే కలిసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీపికని ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆస్కార్ పురస్కారాల టీమ్ పిలిచిన సంగతి తెలిసిందే.

దీపిక పడుకొనే (Deepika Padukone) ప్రస్తుతం తెలుగులో ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చేస్తోంది.. అదీ ప్రభాస్ సరసన.!

hellomudra

Related post