Maheshbabu Priyanka Chopra Yeshaalu.. మహేష్‌బాబు సినిమాలోని డైలాగ్ ఇది.! ఈ డైలాగునే తాజాగా మహేష్‌బాబు సోషల్ మీడియా వేదికగా ఉపయోగించేశాడు.!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘గ్లోబ్‌ట్రోటర్’ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. నవంబర్‌లో, కీలక అప్డేట్స్ ఈ సినిమా నుంచి రావాల్సి వుంది.
Maheshbabu Priyanka Chopra Yeshaalu.. 2030లో మొదలెడదామా.?
నవంబర్ వచ్చేసింది, అప్డేట్స్ ఏవీ? ఎక్కడ.? అంటూ, దర్శకుడు రాజమౌళిని మహేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు.
ఇప్పుడే కదా నవంబర్ వచ్చింది.. ఇద్దాంలే.. అంటూ, రాజమౌళి సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో, ‘ఇంకెప్పుడు, 2030లోనా.?’ అంటూ మహేష్ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు.
మరోపక్క, అందరికీ తెలిసిన విషయాన్ని సర్‌ప్రైజ్.. అని చెబుదామా.? అని మహేష్ – రాజమౌళి మధ్య ఇంట్రెస్టింగ్ ట్వీట్ కన్వర్జేషన్ జరిగింది.
మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక చోప్రా. దాంతో, ‘ఓరి నీ యేషాలో..’ అంటూ మహేష్, తనదైన స్టయిల్లో ప్రియాంకకి రిప్లయ్ ఇచ్చాడు.
‘హా.. హా.. బెటర్ లక్ నెక్స్‌ట్ టైమ్..’ అంటూ, ప్రియాంక సెటైరేయడంతో, మహేష్ పై విధంగా స్పందించాడు.
ఈ కన్వర్జేషన్ ప్రకారం చూస్తే, పృధ్వీరాజ్ సుకుమారన్‌కి సంబంధించిన లుక్ తొలుత వచ్చేలా వుంది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా లుక్ రావొచ్చు.
చివరగా, మహేష్ బాబు లుక్కుని దర్శకుడు రాజమౌళి రివీల్ చేసే అవకాశం వుంది. ‘చివర్లో, బెస్ట్ వన్ విడుదల చేస్తాడన్నమాట రాజమౌళి..’ అంటూ, ప్రియాంకకి మహేష్ సమాధానమిచ్చాడు.
అంతా బాగానే వుందిగానీ..
దేశీ గర్ల్ ప్రియాంక, హైద్రాబాద్ రోడ్ల మీద తిరుగుతూ ఫొటోలు షేర్ చేస్తోంది.. అంటూ, మహేష్ అనడం.. సీక్రెట్స్ రివీల్ చేసెయ్యాలా.. అని ప్రియాాంక టీజ్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
అయితే, ‘ఓరి దీని యేషాలో..’ అని మహేష్ కామెంట్ చేయడం, కొందరు నెటిజన్లకు నచ్చలేదు. ప్రియాంక అంటే, గ్లోబల్ స్టార్.!
Also Read: ‘బాహుబలి ది ఎపిక్’ సమీక్ష: జస్ట్ రీ-రిలీజ్ అంతే.!
అలాంటి, ప్రియాంకని ఉద్దేశించి ‘ఓరి దీని యేషాలో’ అని మహేష్ అనడం, ఏమంత సబబుగా లేదన్నది ఆ కొందరు నెటిజన్ల వాదన.!
వివాదం.. అంటూ, ఏదో ఒకటి కావాలి కదా.! ఆ వివాదానికి అవసరమైన కంటెంట్ మహేష్ ఇచ్చేశాడని అనుకోవాలా.? అంతేనేమో.!
