Maheshbabu SSMB28 Title సూపర్ స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి, మహేష్ అభిమానులు ఒకింత ఆగ్రహంతో వున్నారు.
కారణం, ఈ సినిమా టైటిల్.! అధికారికంగా ఇంకా ఈ సినిమా టైటిల్ ప్రకటితమవలేదుగానీ, ‘అమరావతికి అటు ఇటు’ అంటూ ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.
దర్శకుల్ని తిడితే టైటిల్ మారుతుందా.?
నిర్మాణ సంస్థపై దుమ్మెత్తి పోస్తే, కథకు అనుగుణంగా పెట్టాలనుకున్న టైటిల్‌ని మార్చేస్తారా.?
అభిమానుల పైత్యం.. అత్యంత దురదృష్టకరం.!
సినిమా టైటిల్ మీద దర్శకుడికీ, నిర్మాణ సంస్థకీ సంబంధం లేదా.?
అభిమానులే హీరోలకు శాపంగా మారుతున్న వైనం.!
Mudra369
దీంతోపాటు, పలు ఇతర టైటిళ్ళనూ సోషల్ మీడియాలో కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు.. ‘అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం’ అంటూ.
Maheshbabu SSMB28 Title.. మహేష్ అభిమానుల అసహనం..
‘గురూజీ’ త్రివిక్రమ్ తమ అభిమాన హీరో సినిమాకి చెత్త టైటిల్ పెట్టబోతున్నాడంటూ అప్పుడే మహేష్ అభిమానులు మండిపడుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఈ తరహా సాఫ్ట్ అండ్ డిఫరెంట్ టైటిల్స్ పెట్టడం త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి కొత్తేమీ కాదు.
పవన్ కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ సినిమా చేసినా, అల్లు అర్జున్‌తో ‘అల వైకుంటపురములో’ అనే సినిమా తెరకెక్కించినా.. త్రివిక్రమ్ టైటిల్స్ సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.
ఇందులో రాజకీయమేముంది.?
అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆ రాజధానికి ‘కమ్మ’ రాజధాని అనే పేరు పెట్టింది వైసీపీ.. రాజకీయ కోణంలో. ఆ అంశం చుట్టూ పెద్ద రచ్చ జరుగుతోంది.
Also Read: మంచు మనోజ్ వర్సెస్ విష్ణు.! ‘మంచి’ పెంపకం ఇదేనా.?
ఈ క్రమంలో ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ గనుక మహేష్ సినిమాకి త్రివిక్రమ్ ఖరారు చేస్తే, ఆ తర్వాత జరిగే రచ్చ వేరేలా వుంటుంది.
ఇంతకీ, ఈ టైటిల్ విషయంలో నిజమెంత.? ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ ఏం చెప్పబోతోంది.? వేచి చూడాల్సిందే.