Malaika Arora Arjun Moma.. కుర్రోడితో ఆంటీ.. అంటూ ఈ జంటకు బాలీవుడ్‌లో భలే క్రేజ్ వుందిలే. అస్సలేమాత్రం సిగ్గు పడకుండా చెట్టా పట్టాలేసుకుని నచ్చినట్లు తిరిగేస్తూ ఎంజాయ్ చేసేస్తుంటారీ జంట.
ఎవరో మీకీపాటికే తెలిసిపోయుంటుంది. అదేనండీ మలైకా అరోరా, అర్జున్ కపూర్ జంట గురించే మనం మాట్లాడుకుంటున్నాం.
దాదాపు 11 ఏళ్లకు పైనే ఏజ్ గ్యాప్ వున్న 100 పర్సెంట్ లవ్వు కహానీ.! అందుకే బాలీవుడ్‌లో ఈ ప్రేమ జంట ఎప్పటికప్పుడే ట్రోల్స్‌కి గురవుతూ వుంటుంది.
Malaika Arora Arjun Moma.. అవునా.! అది నిజమేనా.?
లవ్వు స్టేజ్ దాటేసి, చాలా కాలంగా ఇద్దరూ సహజీవనం కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో, రీసెంట్‌గా ఓ గాసిప్ బాలీవుడ్ వర్గాల్లో తెగ చక్కర్లు కొట్టేసింది.

మలైకా అరోరా ప్రెగ్రెంట్ అన్నదే ఆ గాసిప్ సారాంశం. అర్జున్ కపూర్ కారణంగా మలైకా అరోరా ప్రెగ్నెంట్ అయ్యిందనీ ఈ మధ్య మీడియాలో ఓ కథనం వెలువడింది.
ఇంకేముంది.. క్షణాల్లో ఆ న్యూస్ వైరల్ అయిపోయింది. దాంతో, అర్జున్ కపూర్ గుస్సా అయ్యాడు. ఈ గాసిప్‌పై తనదైన శైలిలో స్పందించాడు.
తూచ్ అదంతా వుత్తదే.!
ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేసేముందు, ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే బావుంటుంది.. అని మీడియాకి చురకలంటించాడు అర్జున్ కపూర్.
అవును మేం నటులం. మాకంటూ మా పర్సనల్ లైఫ్‌ని సైతం ప్రవేట్‌గా వుంచలేం అలా అని అంత ఈజీగా ఇలాంటి దుష్ర్పచారం చేసేస్తారా.? అని తగులుకున్నాడు.
Also Read: Sunny Leone.. ‘జీరో’ టాలెంట్.! ఊహించనంత స్టార్‌డమ్.!
ఆల్రెడీ మలైకా అరోరాకి వివాహమై 16 ఏళ్ల కుమారుడు కూడా వున్నాడు. అయితే, మొదటి భర్తకు విడాకులిచ్చేసి, అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్‌లో వుంది.
ప్రస్తుతం ఆమె వయసు 50 ఏళ్లు.. ఐదు పదుల వయసులో ప్రెగ్నెన్సీ న్యూస్ అంటే కాస్త ఇబ్బందిగానే వుంటుంది.
అందుకే అర్జున్ కపూర్ అంతలా కస్సుమన్నాడు కాబోలు. ఏది ఏమైనా అర్జున్ కపూర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.