Malavika Mohanan Marriage.. సెలబ్రిటీల పెళ్లి యవ్వారాలంటే ఎప్పుడూ ఇంట్రెస్టే కంటెంట్ ప్రియులకి. అయితే, పెళ్లెప్పుడు.? అని అడిగితే కొందరు సెలబ్రిటీలు పాజిటివ్‌గానే స్పందిస్తారు.
కానీ, కొందరయితే చాలా ఘాటుగా స్పందిస్తుంటారు.
ఎక్కడ లేని కోపం తెచ్చుకుంటారు. తాజాగా ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌కి అలాగే కోపమొచ్చింది. నా పెళ్లితో మీకేం పని.? అని విరుచుకుపడింది.
నా పెళ్లి గురించి నాకు లేని తొందర మీకెందుకు.? అని కసురుకుంది. అయినా అప్పుడే పెళ్లయిపోవాలని మీరెందుకు కోరుకుంటున్నారు.? అని రివర్స్ క్వశ్చన్స్ వేసింది.
Malavika Mohanan Marriage..క్రేజీ ఇమేజ్.!
ప్రస్తుతం మాళవిక మోహనన్ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కూడా బాగానే బిజీగా గడుపుతోంది. అప్పుడెప్పుడో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సింది మాళవిక.
కానీ, పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఇంతవరకూ డైరెక్ట్ ఎంట్రీకి నోచుకోలేదు. త్వరలోనే ప్రబాస్ ‘రాజా సాబ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది.

అయితే, ‘మాస్టర్’, ‘మారన్’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైపోయిందనుకోండి. అంతేకాదు, బోలెడంత క్రేజీ ఇమేజ్ కూడా సొంతం చేసుకుంది మాళవిక మోహనన్.
సోషల్ మీడియాలో స్పెషల్ హాట్ ఫోటో షూట్లకి దాసోహం అనే ఫాలోవర్లున్నారు మాళవిక మోహనన్‌కి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అమ్మడిని ‘ఫెళ్లెప్పుడు.?’ అని అడగ్గా పై విధంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయినా మూడు పదుల వయసులో పెళ్లెప్పుడు.? అని అడిగితే అంతలా ఉలికి పడాలా.?
ఆ మాత్రానికే అంత ఉలుకెందుకు పాపా నీకు.!
ఇదే ఇప్పుడు నెట్టింట జరుగుతోన్న చర్చ. అయితే, ప్రస్తుతం కెరీర్‌లో ఫుల్ బిజీగా గడుపుతోంది మాళవిక మోహనన్ (Malavika Mohanan).
Also Read: అమ్మాయిలే దొంగలైతే! అమెరికాలో తెలుగోళ్ళ పరువు పాయే!
ఈ టైమ్‌లో పెళ్లి గురించి ఆలోచించే అవకాశమే లేదు. అయినా, ప్రస్తుతం పరిస్థితుల్లో సెలబ్రిటీలకి పెళ్లి అనేది ఆటంకమే కాదని చెప్పొచ్చు.

స్టార్ సెలబ్రిటీలు సైతం బిజీ షెడ్యూల్‌లోనూ పెళ్లిళ్లు చేసుకుని, ఓ వైపు వైవాహిక జీవితాన్ని మరోవైపు కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.