Malavika Mohanan Tollywood Shock.. మాళవిక మోహనన్ తెలుసు కదా.? పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి ఈమ సుపరిచితురాలే.
నిజానికి, గతంలో ఓ తెలుగు సినిమా చేసింది మాళవిక మోహనన్ (Malavika Mohanan). ఔను, చేసింది.. అంటే, చేసిందంతే. కానీ, ఆ సినిమా విడుదల కాలేదు. సినిమా పేరేమో ‘హీరో’.!
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా ‘హీరో’ సినిమా ప్రారంభమైంది. మాళవిక మోహనన్ హీరోయిన్. షూటింగ్ కొంత భాగం జరిగింది కూడా.
Malavika Mohanan Tollywood Shock.. అప్పట్లో అలా తేడా కొట్టి..
ఏమయ్యిందోగానీ, అనూహ్యంగా ‘హీరో’ సినిమా ఆగిపోయింది. ఇక, సినిమాని ముందుకు తీసుకెళ్ళే సాహసం చేయలేదు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.
మళ్ళీ చాన్నాళ్ల తర్వాత మాళవిక మోహనన్, ఇంకో తెలుగు సినిమాకి కమిట్ అయ్యింది. ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అది.

ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతోంది. కానీ, ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.
‘వద్దు, ఈ సినిమాని అస్సలు రిలీజ్ చేయొద్దు.. కావాలంటే థియేటర్లలో మానేసి, ఓటీటీలో రిలీజ్ చేసుకోండి..’ అని అభిమానులే తెగేసి చెబుతున్నారు.
ఎందుకిలా.? ఏమోగానీ, తన సినిమా విషయంలోనే.. అందునా, తెలుగు సినిమా విషయంలో ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడంలేదు మాళవిక మోహనన్‌కి.
ఏమో.. సినిమా విడుదలవుతుందో లేదో..
తాజాగా, ఈ సినిమాకి సంబంధించి ఓ వీడియో క్లిప్ బయటకు వచ్చింది. ఓ యాక్షన్ ఎపిసోడ్ తాలూకు వీడియో అది.
Also Read: Shilpa Shetty.. అప్పుడూ.. ఇప్పుడూ మెరుపు తీగే.!
మాళవిక మోహనన్ (Malavika Mohanan) కష్టపడి నటించేసింది ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో. ఇంతకీ, ప్రభాస్ (Rebel Star Prabhas) ఎక్కడ.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
‘సలార్’ విడుదల చేసుకోవాలి.. ‘ప్రాజెక్ట్-కె’ పనులు చక్కెబెట్టుకోవాలి. వీటి నడుమ, మారుతి దర్శకత్వంలో సినిమా అంటే, ప్రభాస్‌కి అది తలనొప్పి మాత్రమే.!