Maldieves Vs Lakshadweep అహాహా.. మాల్దీవుల్లో ఎంజాయ్‌మెంట్ అంటే ఆ కిక్కే వేరప్పా.! ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆనందం, మాల్దీవుల్లోనే.. అంటుంటారు చాలామంది సెలబ్రిటీలు.
వెకేషన్ అనగానే, మాల్దీవులకు చెక్కేసి.. అక్కడి సముద్రపు అలల్లో తేలియాడుతూ.. ఆ కిక్కుని ఎంజాయ్ చేయడం సినీ సెలబ్రిటీలకు మహా మహా ఇష్టం.
కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. మాల్దీవులంటేనే మంటెత్తిపోతున్నారు సినీ సెలబ్రిటీలు.!
Maldieves Vs Lakshadweep.. లక్షద్వీప్ వుండగా మాల్దీవులెందుకు దండగ.?
కొత్తగా ఏమన్నా లక్షద్వీప్ పుట్టుకొచ్చిందా.? ఎప్పటినుంచో వున్నదే. అండమాన్ అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అక్కడిదాకా ఎందుకు.? చెన్నయ్ బీచ్.. మన విశాఖపట్నం బీచ్.. చెప్పుకుంటూ పోతే, మన భారతదేశంలోని సముద్ర తీర అందాలు అన్నీ ఇన్నీ కావు.
కానీ, పొరుగింటి పుల్లకూర యమా రుచి కదా.! అద్గదీ అసలు సంగతి. అందుకే, మాల్దీవులకు పారిపోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది వెకేషన్ కోసం.
వాళ్ళు ఛీకొట్టాక.. మన బంగారం గుర్తుకొచ్చింది.!
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్‌కి వెళ్ళారు. ఇక్కడి ప్రకృతి అందాలు అద్భుతమంటూ కొనియాడారు.
దాంతో, మాల్దీవుల్లో కొందరు ప్రజా ప్రతినిథులకి ఒళ్ళు మండిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీని బూతులు తిట్టారు.
అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ‘మేం ఇకపై మాల్దీవులకు రాబోం..’ అంటూ సెలబ్రిటీలు తేల్చి చెప్పేశారు. ఎడా పెడా అప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్ల క్యాన్సిలేషన్స్ జరిగిపోయాయ్.
పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో.. వేల సంఖ్యలో సెలబ్రిటీలు తమ మాల్దీవ్ పర్యటనల్ని రద్దు చేసుకోవడం గమనార్హం.
Also Read: Tamannaah Bhatia.. కైపెక్కిస్తోన్న అందాల ఖజానా.!
‘తప్పు జరిగిపోయింది.. ఆ ప్రజా ప్రతినిథులపై చర్యలు తీసుకున్నాం..’ అంటూ మాల్దీవ్ ప్రభుత్వం వాపోతోందిప్పుడు.
మాల్దీవులకి ప్రధాన ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తుంది. అందునా, మన భారతదేశానికి చెందిన పర్యాటకులే మాల్దీవుల్ని పెంచి పోషిస్తున్నారనడం అతిశయోక్తి కాదు.!
అయ్యిందేదో అయ్యింది. ఇకనైనా మన గోవా, మన విశాఖపట్నం, మన లక్షద్వీప్, మన అండమాన్ నికోబార్.. వంటి ప్రాంతాల్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసుకుందాం.!
ఇంతకీ, ఇప్పుడు ‘బ్యాన్ మాల్దీవ్స్’ అంటున్న సెలబ్రిటీలు, తమ జీవితంలో ఒక్కసారైనా లక్షద్వీప్ వెళ్ళారా వెకేషన్ కోసం.? వెళ్ళి వుంటే, ఆ ఫొటోల్ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే బెటర్ కదా.?