వెండితెరపై చెయ్యకూడనిదంతా చేసేసింది నటి మల్లికా షెరావత్. హిందీ సినీ పరిశ్రమలో అశ్లీలతకు కేరాఫ్ అడ్రస్.. అనిపించేసుకున్న మల్లికా షెరావత్ (Mallika Sherawat Hottest Bollywood Beauty) గురించిన ‘హాటు హాటు కథలు’ ఎన్నెన్నో ప్రచారంలో వున్నాయి. అప్పట్లో ఇలాంటివాటిని మల్లిక భలేగా ఎంజాయ్ చేసింది. ‘పాపులారిటీ పెంచుతున్నాయ్ కదా..’ అంటూ హస్కీగా తనదైన స్టయిల్లో చాలా సార్లు ఆ ‘బూతు ప్రచారాలపై’ స్పందించిందామె.
అలాంటి మల్లికా షెరావత్ ఇప్పుడు అనూహ్యంగా ప్లేటు ఫిరాయించేసరికి అంతా ముక్కున వేలేసుకోక తప్పలేదు. ‘వృద్ధనారీ పతివ్రత.. అన్నట్టు, మల్లికా షెరావత్ వయసు మీద పడ్డంతో ఇలా నీతులు మాట్లాడుతోందన్నమాట..’ అంటూ ఆమె వ్యాఖ్యలపై సెటైర్లు పడుతుండడాన్ని ఎలా తప్పు పట్టగలం.?
అసలింతకీ మల్లికా షెరావత్ ఇంతలా మారిపోవడానికి కారణమేంటి.? ఒకప్పుడు ‘సెక్సీ బాంబ్’ అనిపించుకోవడాన్ని ఘనతగా భావించిన ఈ హాట్ బ్యూటీ, తెరపై నగ్నంగా నటించడానికైనా ‘సై’ అనేసిన ఈ సెక్సీ భామ.. ఇప్పుడు నీతులు చెబుతోంటే, ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.
‘నేను తెరపై ఎలా కనిపిస్తే, నా రియల్ క్యారెక్టర్ కూడా అలాంటిదేనని అంతా అనుకున్నారు. నన్ను వేధించారు.. రకరకాల రాతలతో అవమానపరిచారు..’ అంటూ వాపోయింది మల్లికా షెరావత్. అప్పట్లో, ఆ గాసిప్స్ అలా పుట్టాయంటే, దానిక్కారణం ఆమె వదిలిన కంటెంట్.. గాసిప్స్ ద్వారా పాపులారిటీ పెరుగుతుందంటూ ఆమె ఇచ్చిన ప్రోత్సాహం.. అలా ఆ రాతలకి కారణం. వాటినే, ఇప్పడామె తప్పుపడుతోంది.
అప్పుడు హాట్ పబ్లిసిటీ అవసరమైంది.. ఇప్పుడు సింపతీ అవసరమైంది.. అందుకే, అప్పుడలాంటి మాటల.. ఇప్పుడిలాంటి నిష్టూరాలు.. మల్లికా షెరావత్ (Mallika Sherawat Hottest Bollywood Beauty) అప్పటికీ, ఇప్పటికీ మారలేదు.. పబ్లిసిటీ స్టంట్స్ విషయంలో.