Mamta Mohandas.. మమతా మోహన్ దాస్.! ఈ పేరు గుర్తుందా.? అదేనండీ, యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా నటించిన ‘యమదొంగ’ సినిమాలో నటించింది కదా ఆ బ్యూటీనే.!
నటి మాత్రమే కాదు, మమతా మోహన్ దాస్ మంచి సింగర్ కూడా.! తెలుగులో పలు సినిమాల్లో నటించడమే కాదు, పాటలు కూడా పాడింది.
ప్రస్తుతానికైతే మలయాళ సినీ పరిశ్రమలో ఒకింత బిజీగానే వుంది. నటన, పాటలు పాడటమే కాదు, మమతా మోహన్ దాస్‌కి దర్శకత్వంపైనా అవగాహన వుంది. పాటలు కూడా రాస్తుంది. సంగీత జ్ఞానం కూడా వుందామెకి.
Mamta Mohandas క్యాన్సర్ బాధితురాలే.. కానీ, విజేత.!
మమతా మోహన్ దాస్ గతంలో క్యాన్సర్ బారిన పడింది. ఒకసారి కాదు, రెండు సార్లు క్యాన్సర్ కారణంగా చాలా చాలా ఇబ్బందులు పడింది.

క్యాన్సర్ కారణంగానే మమతా మోహన్ దాస్ కెరీర్ ఒకింత అయోమయంలో పడిపోయింది అప్పట్లో. కానీ, క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాక మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయింది.
బతికే వున్నావా.? సాక్ష్యమేంటి.?
యూ ట్యూబర్లు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవాళ్ళు, కొన్ని మీడియా సంస్థలు (వెబ్ మీడియా ముఖ్యంగా).. సంచలనాల కోసం సెలబ్రిటీల్ని తమ వార్తల్లో చంపేస్తున్నారంతే.
జనాలు నమ్ముతారంటే, ఎవర్నయినాసరే చంపేస్తారు తమ రాతలతో అంతలా తయారైంది ఈ పైత్యం. ఈ విషయంలో ఏమాత్రం ఇంగితం వుండట్లేదు. సిగ్గూ.. లజ్జా.. అన్నీ వదిలేశారంతే.

తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా మమతా మోహన్ దాస్ స్పందించింది. ‘లైవ్’ అనే ప్రాజెక్టులో బిజీగా వున్నాననీ, తాను జీవించే వున్నాననీ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
Also Read: అప్పుడే చచ్చిపోను: కంటతడి పెట్టిన సమంత.!
క్యాన్సర్ సోకితే అందరూ చనిపోతారనుకోవడం పొరపాటు. మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, లిసా రే.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దది.
క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా క్యాన్సర్ బారిన పడ్డాడు కోలుకున్నాడు. అంతెందుకు, సీనియర్ నటి గౌతమి కూడా ఒకప్పుడు క్యాన్సర్ బాధితులే. ఆమె ఆ తర్వాత క్యాన్సర్‌ని జయించారు.