Table of Contents
ఇప్పటికైతే తాను రాయలసీమకు (Rayala Seema) వస్తున్నట్లు సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ స్పష్టతనిచ్చాడు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళి, అక్కడే కొన్ని నెలలపాటు వుంటాడట. అక్కడి యువతనీ, రైతుల్నీ తనవంతుగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు. సినీ నటుడిగా తనది సంతృప్తికరమైన ప్రయాణమనీ చెప్పాడు.
‘రాగి సంగటి’ (Ragi Sangati) మీద, ‘మటన్ పులుసు’ (Mutton Pulusu) మీదా మనోజ్ కుమార్ (Manchu Manoj Kumar) ఉన్నపళంగా ఇంతటి మమకారం పెంచుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? మంచు మనోజ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్లే భావించాల్సి వుంటుందా.? ఈ ప్రశ్నలకు సమాధానం కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. ముందు ముందు మంచు మనోజ్ కుమార్ (Manchu Manoj) ప్రయాణం ఎలా వుండబోతోందోగానీ, ఇప్పటిదాకా ఆయన ప్రయాణాన్ని విలక్షణమైనదిగానే సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారన్న విషయాన్ని మనం ప్రస్తావించుకోక తప్పదు.
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తనయుడిగా..
మంచు మనోజ్ కుమార్ అంటే, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు (Collection King Mohanbabu) తనయుడు. మోహన్‌బాబు కూడా ఒకప్పుడు రాజకీయాల్లో వున్నారు. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లో కాదు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తరఫున ఆయన రాజ్యసభ సభ్యుడిగా (Rajya Sabha Member) పనిచేశారు. ‘అసెంబ్లీ రౌడీ’ (Assembly Rowdy) అనే సినిమాలో నటించి, రాజకీయాలపై ఆయన పంచ్‌లు పేల్చారు. అలా రాజకీయాలపై ఖచ్చితమైన అభిప్రాయం, రాజకీయాలతో అనుబంధం ‘మంచు’ కుటుంబానికి ఉందనేది అందరికీ తెలిసిన సంగతే.
ఆ విషయం పక్కన పెడితే, మంచు విష్ణు లేదా మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) రాజకీయాల్లోకి రావొచ్చునని కొంతకాలంగా ప్రచారం జరిగింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా మంచు మనోజ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని చెప్పలేదుగానీ, ఆ సంకేతాలైతే ఆయన పంపాడని నిస్సందేహంగా భావించొచ్చు. ‘తిరుపతి నుంచి మొదలయ్యే ఈ సహాయం..’ అని మనోజ్ కుమార్ చెప్పిన దరిమిలా, దీన్ని రాజకీయ నిర్ణయమని ఓ కంక్లూజన్‌కి వచ్చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది.
రాగి సంగటి – మటన్ పులుసు
మంచు మనోజ్ కుమార్ భోజన ప్రియుడే. ఆ సంగతి చాలామందికి తెలుసు. అందుకే కొంచెం బొద్దుగా వుంటాడు. ఆ బొద్దుతనం తగ్గించుకోవడానికి ఎన్ని కసరత్తులు చేసినా, ఆహారం మీద మక్కువ కారణంగా ఆ బొద్దుతనం మాత్రం తగ్గడంలేదు. ఈ ప్రస్తావన ఎందుకంటే, రాయలసీమకి వస్తున్నానని చెబుతూ రాగి సంగటి, మటన్ పులుసు రెడీ చెయ్యమని అభిమానులకి, రాయలసీమ (Rayalaseema) ప్రజలకీ పిలుపునిచ్చాడు మనోజ్‌కుమార్. ఈ డైలాగ్, మనోజ్ సెన్సాఫ్ హ్యూమర్‌ని చెప్పకనే చెప్పింది.
సినిమాల్లోనూ మనోజ్ ఇంతే. కేవలం నటుడు మాత్రమే కాదు, ఆయన సినిమాకి సంబంధించి అన్ని విభాగాలపైనా ఖచ్చితమైన అవగాహనతో వుంటాడు. తన సినిమాలకి కొరియోగ్రఫీ చేసుకోవడం దగ్గర్నుంచి, చాలా విషయాల్లో దర్శక నిర్మాతలకు సహాయకారిగా వ్యవహరిస్తాడు. బడ్జెట్‌ని కంట్రోల్‌లో వుంచే క్రమంలో ఓ హీరో ఎంత ఎక్కువ చెయ్యగలడో, అంతకు మించి చెయ్యగలగడం మనోజ్ ప్రత్యేకత. సినీ రంగం పట్ల మనోజ్‌కి ఉన్న కమిట్‌మెంట్ అలాంటిది.
జగన్ వైపుకా? పవన్ వైపుకా?
ఒకవేళ మంచు మనోజ్ రాజకీయాల్లోకి వెళ్ళడమంటూ జరిగితే, ఆయన ఏ పార్టీలో చేరతారు? అనే ప్రశ్న రావడం సహజమే. మంచు కుటుంబానికి అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే వైఎస్ జగన్‌తో (YSR Congress Party YS Jagan Mohan Reddy) బంధుత్వం కూడా వుంది. అలాగని బంధుత్వాన్ని పట్టుకుని మంచు కుటుంబం రాజకీయాలు చేస్తుందని అనుకోవడానికి వీల్లేదు. మరో వైపున జనసేన (Jana Sena Party) నుంచి జనసైనికులు (పవన్‌కళ్యాణ్ Pawan Kalyan అభిమానులు) మంచు మనోజ్‌ని, జనసేన పార్టీలోకి పిలవడం జరుగుతోంది. అయితే ఇది సోషల్ మీడియాలో అభిమానుల హడావిడి మాత్రమే. వీరిలో మంచు మనోజ్ అభిమానులు కూడా వున్నారు.
సీడెడ్ ఒక్కటే కాదు సుమీ
రాయలసీమని సినీ వ్యాపార పరిభాషలో సీడెడ్ అంటాం. అదొక్కటే కాదు, ఆంధ్రా – నైజాం అంతటా తన కార్యక్రమాలుంటాయని మనోజ్ కుమార్ ప్రకటించాడు. బహుశా సేవా కార్యక్రమాల కోసం స్వచ్ఛంద సంస్థలాంటిదాన్ని మనోజ్ ప్రకటించవచ్చు. అలా చేయాలనుకుంటే సినిమాలకు దూరమవ్వాల్సిన అవసరం లేదు.
మనోజ్ సినిమాలకు దూరమవుతున్నట్లు చెప్పలేదు కాబట్టి, కొంచెం గ్యాప్ తీసుకుని, తన దృష్టిని సేవా కార్యక్రమాల వైపుకు మళ్ళిస్తాడనీ, సినిమాలు చేస్తూనే ఉంటాడని అనుకోవాల్సి వుంటుంది. ఏదిఏమైనా, యంగ్ జనరేషన్ కొత్త ఆలోచనలతో సేవాపథంలోకి వస్తే అభినందించాల్సిందే. ఆల్ ది బెస్ట్ మనోజ్. సేవా రంగంలో నీదైన ‘ముద్ర’ వేస్తావని ఆశిస్తున్నారు నీ అభిమానులంతా.!