లావణ్య త్రిపాఠి ప్రేమ కథ.! పెళ్ళి వ్యధ.!
Lavanya Tripathi
Lavanya Tripathi Wedding.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పెళ్ళి చేసుకోబోతోందట. ఇంతకీ, వరుడెవరంట.? వరుడి సంగతి తర్వాత, అసలు లావణ్య త్రిపాఠికి తెలుసా.. ఆమె పెళ్ళి చేసుకోబోతోందని.! నిప్పు లేకుండా పొగ రాదు కదా.? అని ఎవరైనా అనొచ్చుగాక. కానీ, సినిమా గాసిప్స్ విషయంలో నిప్పుతో పని లేదు, పొగ దానంతట అదే వచ్చేస్తుంటుంది.
అయినా, ఇదే తొలిసారి కాదు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్ళి గురించిన పుకార్ల విషయంలో. ఓ డజను.. కాదు కాదు ఓ పాతిక.. కాదు కాదు, ఓ వంద సార్లయినా, లావణ్య పెళ్ళి గురించిన గాసిప్స్ వినిపించి వుంటాయి. ఇదిగో లావణ్య పెళ్ళి.. అదిగో ఆ హీరోతో.. అంటూ పుకార్లు వస్తూనే వున్నాయ్.. అవన్నీ ఉత్తదేనని తేలిపోతూనే వుంది.
Lavanya Tripathi Wedding.. ఎప్పుడంట.?
ఎప్పుడో ఒకప్పుడు.. లావణ్య త్రిపాఠి కూడా పెళ్ళి చేసుకుంటుంది. అలా చేసుకోవాలనుకున్నప్పుడు తన పెళ్ళి గురించి బాహాటంగానే ప్రకటిస్తుంది కూడా. ఇందులో దాపరికం ఏముంటుంది.?

టాలీవుడ్‌కి చెందిన ఓ హీరోతో లావణ్య (Lavanya Tripathi) పెళ్ళి అట.. ఏకంగా 25 లక్షల రూపాయల ఖరీదైన డైమండ్ రింగుతో లావణ్య కోసం బెంగళూరు వెళ్ళాడట ఆ హీరో.. అంటూ తాజా పుకార్లు తెలుగు మీడియాలోనే కాదు, కోలీవుడ్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి.
మామూలుగా అయితే, ‘నాన్సెన్స్’ అని కొట్టి పారేస్తుంటుంది లావణ్య త్రిపాఠి ఇలాంటి పుకార్ల విషయంలో.
Also Read: ధనుష్ – ఐశ్వర్య విడాకులపై ‘వోడ్కా’ మొరుగుడేంది.?
కానీ, ఈసారి లైట్ తీసుకుంది. స్పందించడమే వేస్టని అనుకుంది కాబోలు. ‘మౌనం అర్ధాంగీకారమా.?’ అంటూ మళ్ళీ రచ్చ షురూ అయ్యింది.. సోషల్ మీడియా అలాగే వెబ్ మీడియాలో.
పెళ్ళి పుకార్లు సర్వసాధారణమేగానీ..
పెళ్ళి పుకార్ల సంగతి పక్కన పెడితే, కొన్ని తెలుగు ప్రాజెక్టులతోనూ కొన్ని తమిళ ప్రాజెక్టులతోనూ లావణ్య త్రిపాఠి బిజీగానే కనిపిస్తోంది కెరీర్ పరంగా.
అన్నట్టు, పెళ్ళి పుకార్లు హీరోయిన్లను ఒకింత ఇబ్బంది పెడతాయి కెరీర్ పరంగా చూసుకున్నప్పుడు. అయితే, ఒక్కోసారి ఈ తరహా పుకార్లను హీరోయిన్లు ఎంజాయ్ చేస్తుంటారు.. కారణం, ఫ్రీ పబ్లిసిటీ వీటి ద్వారా వస్తుంది గనుక. అలాగని, అన్నిసార్లూ పుకార్లను కామెడీగా తీసుకోలేరు కదా.?