Manipur Women Violence.. ఏదో ఆషామాషీ ఘటన కాదు.! సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అది.!
మణిపూర్‌లో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అవిప్పుడు ముదిరి పాకాన పడ్డాయి.
జాతుల మధ్య ఘర్షణ అత్యంత హేయమైన స్థాయికి దిగజారింది. మరి, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది.? న్యాయ వ్యవస్థ ఏం చేస్తోంది.?
నిస్సిగ్గు రాజకీయం తప్ప.. మణిపూర్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు అటు రాష్ట్రం, ఇటు కేంద్రం.. ఎవరూ సరిగ్గా స్పందించడంలేదు.
ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన.. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యేవరకూ వెలుగుచూడకపోవడం శోచనీయం.
సోషల్ మీడియాలో ఈ వీడియో ఇంకా వైరల్ అవుతూనే వుంది.
Manipur Women Violence.. ఎందుకు తొలగించలేదు.?
వాస్తవానికి, ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన గంటల వ్యవధిలోనే నిందితులు కటకటాల వెనక వుండాలి.
ఇప్పుడు తీరిగ్గా, ‘ఆ వీడియోలు సోషల్ మీడియా నుంచి తొలగించాలి..’ అంటూ కేంద్రం హుకూం జారీ చేసింది.
‘కేంద్రం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోతే.. మేమే తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది..’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇదే తొలి ఘటన కాదు.. ఇదే చివరి ఘటన కాబోదు.! గత కొంతకాలంగా దేశంలో ఎక్కడో ఓ చోట.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి.
చాలా ఘటనల్లో వీడియోలు బయటకు రావడం లేదంతే. చంపేసి మృతదేహాల్ని డోర్ డెలివరీ చేసే ప్రజా ప్రతినిథులున్నారు మనదేశంలో.
నిస్సిగ్గు రాజకీయాన్ని నగ్నంగా ఉరితీసేదెవరు.?
రేప్ చేయడానికి రాలేదు.. ఏదో అలా అనుకోకుండా జరిగిపోయిందనే మహిళా హోంమంత్రులూ వున్నారు.. మన వ్యవస్థలో.!
అత్యాచారాలు జరిగితే.. ఆడపిల్లల్ని పెంచడం చేతకాని తల్లులదే తప్పనే స్థాయికి దిగజారిపోయిన మహిళా హోం మంత్రుల్ని చూస్తున్నాం.
సిగ్గు పడాల్సిన విషయమే ఇది.! కానీ, ఎలా సిగ్గుపడదాం.? దోషుల్ని శిక్షించడం ద్వారానా.? రాజకీయ రచ్చ చేసి విషయాన్ని పక్కదోవ పట్టించడం ద్వారానా.?
Also Read: వైరల్ వీడియో.! జింకలు పాముల్ని తింటాయా.?
నాలుగు రోజుల హడావిడి.. అది మీడియాలో అయినా, రాజకీయాల్లో అయినా.! అంతే, ఆ తర్వాత షరామామూలే.!
నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని సమాజాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్ఛవాన్ని.. అంటాడో సినీ కవి.! అది నిజమే సుమీ.! కానీ, అడిగేదెవరు.? కడిగేదెవరు.?
అడగడానికీ, కడగడానికీ.. మనం మనుషులం కాదు.. జీవచ్ఛవాలం.!