Mass Jathara Commercial Success.. రవితేజ కొత్త సినిమా ‘మాస్ జాతర’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.!
సినిమా ప్రమోషన్లు గట్టిగానే చేశారు. శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటించింది.
తెలిసిందే కదా.. రవితేజ అంటే మాస్.. మాస్ అంటే, రవితేజ.! కాస్త ట్రెండ్ మార్చాలన్న ప్రయత్నం చేసినా, రవితేజ విషయంలో బెడిసి కొట్టేస్తుంటుంది.
అందుకే, ప్రయోగాలు చేయడానికి ఇష్టపడటం లేదు రవితేజ ఈ మధ్య. ‘మూస’ అనే విమర్శలొస్తున్నా, మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయితేనే, తనకు కథ చెప్పమంటున్నాడీ హీరో.
Mass Jathara Commercial Success.. తూచ్.. అదేం లేదు.!
సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌లో హైపర్ ఆది, ‘కమర్షియల్ సినిమాని సోషల్ మీడియా చంపేస్తోంది’ అంటూ, స్టేట్మెంట్ పాస్ చేసేశాడు.
‘80 శాతం.. చంపేస్తోంది సోషల్ మీడియా’ అని స్పష్టంగానే చెప్పాడు హైపర్ ఆది. వెంటనే, రవితేజ కల్పించుకున్నాడు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
‘మనం ఎక్కువ ఊహించుకుంటున్నాం గానీ.. మరీ అంత ఎక్కువ లేదు..’ అని రవితేజ సెలవిచ్చాడు.
అంటే, సోషల్ మీడియా వేదికగా సినిమా మీద ఎంత ట్రోలింగ్ జరిగినా, సినిమాకి నష్టమేమీ లేదు.. అన్నది రవితేజ ఉద్దేశ్యం అన్నమాట.
Also Read: అధరామృతం.. అవ్వకూడదు విషపూరితం.!
నిజమే మరి.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి అత్యంత దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కట్ చేస్తే, సినిమా చాలా చాలా పెద్ద హిట్.!
‘ఓజీ’ సినిమానే తీసుకుంటే, ఆ సినిమా మీద వచ్చినంత నెగెటివిటీ బహుశా, ఇంకే సినిమా మీదా రాలేదేమో.! అయినా, ‘ఓజీ’ బంపర్ హిట్టు.!
సినిమాలో కంటెంట్ వుండాలేగానీ, ఎంత ట్రోలింగ్ జరిగినా.. సినిమాకి పెద్దగా నష్టం వుండదు.
ఇంతకీ, ‘మాస్ జాతర’ పరిస్థితి ఏంటి.? జస్ట్ వెయిట్ అండ్ సీ.! రవితేజ హిట్ అందుకోవాలని ఆశిద్దాం.
