Meenakshi Chaudhary.. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది అందాల భామ మీనాక్షి చౌదరి. మంచి పొడుగరి. బ్యూటీ కాంటెస్ట్ విన్నర్. కాబట్టి అందంగా ఎట్రాక్ట్ చేయడమెలాగో పాపకి బాగా తెలుసు. సో, అలా తొలి సినిమాతోనే ఓ మోస్తరు ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది మీనాక్షి చౌదరి.
మాస్ రాజా రవితేజతో (Mass Maharaja Raviteja) తాజాగా ‘ఖిలాడి’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో ‘ఖిలేడీ’ అనే ట్యాగ్ తగిలించేసుకునేలానే వుంది అమ్మడు. ఇంతవరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, ప్రోమోల్లో సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తోంది మీనాక్షి చౌదరి.
డాన్సుల్లో ఈజ్‌తో పాటు, మంచి గ్రేస్ కూడా చూపిస్తోంది. హాట్ అప్పీల్‌లో ఏమాత్రం మొహమాటాలున్నట్లు లేవు ఈ ముద్దుగుమ్మకి. ‘ఖిలాడీ’ కోసం మాస్ రాజా రవితేజతో ఘాటు ఘాటుగా లిప్‌లాకులు కూడా లాగించేసింది.
Meenakshi Chaudhary యాక్టర్ కమ్ డాక్టర్ కమ్ మోడల్..
యాక్టర్ కాక ముందే అమ్మడిలో చాలా టాలెంట్లున్నాయ్. ఒక్కొక్కటిగా వాటిని బయటికి తీస్తానంటోంది. బేసిగ్గా డాక్టర్ (డెంటిస్ట్) అయిన మీనాక్షి చౌదరికి (Meenakshi) సినిమాలపై ఇంట్రెస్ట్ కూసింత ఎక్కువే. ఆ ఇంట్రెస్ట్‌తోనే యాక్ట్రస్ కావాలనుకుంది. అనుకోకుండా సుశాంత్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది.

బ్యూటీ కాంటెస్ట్ విన్నర్ అయిన మీనాక్షి చౌదరి ఇక ఇప్పుడు తనలోని యాక్టింగ్ టాలెంట్‌ని బయటకి తీయాలనుకుంటోందట. ఆ క్రమంలోనే సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటోంది. తెలుగులో తొలి సినిమా హిట్టా.? ఫట్టా.? అనే విషయం పక్కన పెడితే, హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది.
అలాగే, మాస్ రాజా రవితేజతో ‘ఖిలాడి’ హిట్ అయ్యిందంటే, మీనాక్షి ఫ్యూచర్‌కి పూల బాట పడ్డట్టే అంటున్నారు ఆమె అభిమానులు. పాపలో ఆ టాలెంట్ వుంది మరి. భాషతో సంబంధం లేకుండా, నటిగా ఛాలెంజింగ్ రోల్స్‌ఎంచుకుంటానంటోంది. అప్పుడేగా టాలెంట్ ప్రూవ్ చేసుకోగలుగుతుంది.
టార్గెట్స్ సంగతి సరే, లక్ సంగతేంటో..
ఇప్పటికే తెలుగుతో పాటు, తమిళంలోనూ కొన్ని ప్రాజెక్టులు ఓకే చేసిన మీనాక్షి చౌదరికి నటిగా కొన్ని టార్గెట్స్ వున్నాయట. ఆ టార్గెట్స్ రీచ్ అయ్యే పనిలోనే ప్రస్తుతం ఫుల్ బిజీగా వున్నానంటోంది అందాల మీనాక్షి చౌదరి.
మోడలింగ్ రంగం నుంచి వచ్చి హీరోయిన్లుగా పరిచయమైన ముద్దుగుమ్మల లిస్ట్ చాలా పెద్దదే. వారిలో ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రా తదితర అందాల భామలు మాత్రమే హీరోయిన్లుగా స్టార్‌డమ్ దక్కించుకున్నారు. ఆ కోవలోనే మీనాక్షి చౌదరి కూడా సత్తా చాటాలనుకుంటోందట.
బాగానే వుంది. కానీ, అది పాత తరం. కొత్త తరంలో బ్యూటీ కాంటెస్ట్‌ల నుంచి, నేరుగా సినిమా రంగంలోకి వచ్చిన శోభితా ధూళిపాళ్ల తదితర ముద్దుగుమ్మలు పెద్ద తెరపై అంతగా సత్తా చాటలేకపోతున్నారు.
Also Read: ఆ తప్పు చేయనంటోన్న అలియా భట్.!
మరి ఆ కోవలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నిలదొక్కుకోగలుగుతుందా.? ఆమె జోరు, ఆమెకు దక్కుతున్న అవకాశాల హోరు చూస్తోంటే, ఈ బ్యూటీ తెలుగునాట గట్టిగానే పాగా వేసేలా కనిపిస్తోంది.
అందం, అభినయం.. దానికి తోడు కాస్తంత లక్కుంటే, ఆ సక్సెస్ కిక్కు వరించడం ఎంత పని చెప్మా.!