Table of Contents
Mega Star Chiranjeevi Biggest.. మెగాస్టార్ చిరంజీవి.! బిగ్గర్ దేన్ బచ్చన్.! ఓ ఆంగ్ల పత్రిక కథనం.! ఎప్పుడో.. ఎన్నో ఏళ్ళ క్రితమే, చిరంజీవి ఘనతని కొనియాడింది.!
ఎంత ఎదిగినా ఒదిగి వుండడం చిరంజీవి ప్రత్యేకత.! ఊరికే ఆయన సుప్రీం హీరో అయిపోలేదు.. ఊరికే ఆయన మెగాస్టార్ అయిపోలేదు.!
తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్‌డమ్ ఆయన సొంతం.! ఎన్నిసార్లు ఇలా మాట్లాడుకుని వుంటాం.! మాట్లాడుకుంటూనే వుంటాం.!
Mega Star Chiranjeevi Biggest.. చిరంజీవి.. ఎప్పటికీ చిరంజీవే.!
ఔను, చిరంజీవి ఎప్పటికీ చిరంజీవే.! 150కి పైగా సినిమాలు.. వాటిల్లో డాన్సులు, ఫైట్లు.. వాట్ నాట్.!
చిరంజీవి కామెడీ చేస్తే.. అది వేరే లెవల్.! డాన్స్ చేస్తే, ఫైట్స్ చేస్తే.. ప్రతీదీ ప్రత్యేకమే.! చిరంజీవి కంటతడి పెడితే, ఇంకేమన్నా వుందా.?
స్వయంకృషితో ఎదిగారు చిరంజీవి. ఔను, డాన్సులైనా.. యాక్షన్ ఎపిసోడ్స్ అయినా.. ఏం చేయాల్సి వచ్చినా, తనను తాను వాటికి తగ్గట్టుగా మలచుకున్నారు.
ఆయన స్థాయి వేరు..
ఆన్‌లైన్‌లో తీరిగ్గా టిక్కెట్లు బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళే రోజులివి.! కానీ, చిరంజీవి సినిమా అంటే.. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది ఒకప్పుడు.
ఎన్ని గంటలైనాసరే, చిరంజీవి (Mega Star Chiranjeevi) సినిమా టిక్కెట్ దొరికితే.. అది మహాప్రసాదం కింద లెక్క.!

ఈ రోజు సినిమా టిక్కెట్ దొరకలేదా.? రేపైనా దొరుకుతుందా.? ప్రతిరోజూ థియేటర్ల దగ్గర టిక్కట్ల కోసం కాపలా కాసిన అనుభవాలు వందల మందికి, వేల మందికి.. లక్షల మందికి వుంటాయ్.!
చిరంజీవి (Chiranjeevi) అంటే, జస్ట్ స్టార్ హీరో మాత్రమే కాదు.! అంతకు మించి.! ఔను, చిరంజీవికి మించి ఇంకేముంటుంది.?
అక్షరాలు.. పదాలూ.. సరిపోవు.!
రాయడానికి అక్షరాలు సరిపోవు.! రాసేందుకు సమయమూ సరిపోదు.! రాస్తూనే వుండాలి.! కొత్త కొత్త పదాలూ కనిపెట్టాల్సి వస్తుందేమో.!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అంటే వ్యక్తి కాదు.. ఓ శక్తి.! ఔను, ఆ మెగా సమ్మోహన శక్తి.. దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.!
Also Read: తెలుగు జాతి ఆణిముత్యం రామోజీరావు.! అంతేనా.?
ఆరు పదవుల వయసు దాటి, ఏడు పదుల వయసులోకి వెళ్ళబోతున్నా.. నేనూ కుర్రాడినే.. అన్నట్లు డాన్సులు చేయడానికి, రిస్కీ స్టంట్స్ చేస్తూనే వున్నారు.
తనను తాను ఎప్పటికప్పుడు సరికొత్తగా మలచుకుంటూ.. కొత్త తరం నటీనటులకు ఆదర్శంగా నిలుస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఎప్పటికీ చిరంజీవే.!