ఆళ్ళెవరో గెలిస్తే, సిరంజీవి (Mega Star Chiranjeevi) ఓడిపోవడమేంటెహె.! ఓ సామాన్య సినీ ప్రేక్షకుడి మాట ఇది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయ్. మంచు విష్ణు గెలిచాడు. ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. కాదు కాదు, మంచు విష్ణుకి ఓట్లెక్కువ వచ్చాయ్.. ప్రకాష్ రాజ్‌కి తక్కువ ఓట్లు వచ్చాయ్.
అసలు గెలుపోటములంటే ఏంటి.? 270 మందికి పైగా సభ్యుల మనసుల్ని ప్రకాష్ రాజ్ గెలవడం ఓటమి ఎలా అవుతుంది.? ఇంకా ఎక్కువమంది మనసుల్ని మంచు విష్ణు గెలిచాడు. అయినా, ఇందులోకి చిరంజీవిని లాగడమెందుకు.? అదొక పైశాచిక ఆనందం.
పెద్దన్నయ్య చిరంజీవి.. Mega Star Chiranjeevi
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ఒక లెజెండ్. కానీ, అలా ఒప్పుకునేందుకు చాలామందికి అహం అడ్డు వస్తుంది. అదే అసలు సమస్య. చిరంజీవి పెద్దరికాన్ని కొందరు ఒప్పుకోలేరు. వాళ్ళతోనే అసలు సమస్య. అసలంటూ చిరంజీవి, తనకు పెద్దరికం కావాలని ఎవర్నయినా అడిగారా.? తాను ‘పెద్దన్న’ అనే మాట చిరంజీవి ఎక్కడన్నా చెప్పారా.?
Also Read: ది ‘గ్రేట్’ సొల్లు పురాణం! మూర్ఖులకి అర్థమయ్యిందిదే!
పరిశ్రమ సమస్యల నేపథ్యంలో చిరంజీవిని ముందు పెట్టి, కొందరు సినీ ప్రముఖులు తెలుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీన్ని ఇంకొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. పోటీలోంచి తప్పుకోమని ‘చిరంజీవి అంకుల్’ చెప్పారన్నది మంచు విష్ణు వెర్షన్. ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన.?
ఆధిపత్యపోరు.. ఆనక పైశాచికానందం..
సో, ఇక్కడ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.. ఇది ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వ్యవహారం కాదు, అంతకు మించి ఇంకోటేదో ఆధిపత్య పోరు అని. ఒకవేళ చిరంజీవి అలా చెప్పినా, ‘ఏకగ్రీవం’ ఆలోచనతో ఆయన అలా చెప్పి వుండొచ్చేమో కదా.?
Also Read: అరరె చిరంజీవి ‘అందరివాడు’ అయిపోయాడేంటబ్బా.!
ఎలా చూసినా, ఇక్కడ చిరంజీవిని బదనాం చేయడం.. అనే ఓ దిక్కుమాలిన రాజకీయం రాజ్యమేలుతోంది. దీన్నుంచి చిరంజీవి బయటపడటమెలా.? అంత సీన్ లేదు. చిరంజీవి ఎప్పటికీ చిరంజీవే. సిరంజీవిని (Mega Star Chiranjeevi) ఓడించేశామనే పైశాచికానందం పొందేటోళ్ళ గురించి ఇంతకు మించి ఇంకేం మాట్లాడుకుంటాం.? నాన్సెన్స్ కాకపోతే.!
చివరగా.. ఏనుగు అలా హుందాగా నడిచెళుతోంటే.. ‘గ్రామ సింహాలు’ మొరుగుతాయ్.. అలాగని, ఏనుగు హుందాతనం తగ్గిపోతుందా.?
- BeeyeS