Mega Star Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి సినిమాకి ప్రత్యేకంగా ప్రచారం అవసరమా.? పోనీ, అవసరమే అనుకుందాం.! ప్రత్యేక రైలు పెట్టి మరీ అభిమానుల్ని తరలించాలా.? పోనీ, తరలిస్తారనే అనుకుందాం.!
కానీ, అదసలు నేరమైతే కాదు కదా.! సినిమా ప్రచారం కోసం ఆయా చిత్రాల నిర్మాణ సంస్థలు రకరకాల వ్యూహాలు అమలు చేస్తుంటాయ్. సినిమా అంటేనే వ్యాపారం.!
‘ఆచార్య’ ఫ్లాప్ తర్వాత ‘గాడ్ ఫాదర్’ సినిమాకి ఎలాంటి వసూళ్ళు వచ్చాయో చూశాం. చాలామంది ఓటీటీలో చూసేసిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ ‘గాడ్ ఫాదర్’.
Mega Star Chiranjeevi.. టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవి
కేవలం చిరంజీవిని (Chiranjeevi) చూడ్డానికే థియేటర్లకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినిమాకే ‘గాడ్ ఫాదర్’ అని అభిమానులు ఇంకోసారి డిసైడ్ చేసిన సందర్భమది.
అంతేనా, ‘గాడ్ పాదర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. డబ్బులు ఖర్చు చేస్తే వచ్చే అభిమానం కాదది.!

ముఖ్యమంత్రులుగా వున్నవారు తమ ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేసి వేలల్లో జనాన్ని తీసుకొస్తున్న రోజులివి. అలా అధికారంలో వున్నవాళ్ళు ప్రజాధనాన్ని ఖర్చు చేసి సొంత ప్రచారం చేసుకుంటున్నారు.
ఆ దోపిడీలో మీడియాకీ భాగముంది..
నిజానికి, మీడియా అనేది ప్రశ్నించాల్సింది ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న రాజకీయ నాయకుల్ని. కానీ, అంత ధైర్యం ఇప్పుడున్న మీడియాలో కనిపించడంలేదు.
Also Read: Rashmi Gautam.. తెలుగు తంటా.! ఎందుకోస‘మంట’.!
అందునా, రాజకీయ పార్టీల టాయిలెట్ పేపర్లలా కొన్ని మీడియా సంస్థలు మారిపోతున్నాయి. అదీ అసలు సమస్య. సరే, యజమానులకు బాకా ఊదితే ఊదారు.. ఇతరుల మీద విషం చిమ్మడమెందుకు.?
గడ్డి తినడానికి.. కాదు కాదు, పెంట తినడానికి అలవాటు పడిన మీడియా చిత్రంగా.. సినిమా మీదా.. సినిమా నటుల మీదా పడి ఏడుస్తోంది.
150కి పైగా సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవికి హిట్టు సినిమాలు కొత్త కాదు.. సరికొత్త రికార్డులు సృష్టించడమూ కొత్త కాదు.!
స్వయంకృషితో తెలుగు సినీ పరిశ్రమలో శిఖరాగ్రానికి చేరుకున్న చిరంజీవిని చూసి, కొన్ని గ్రామ సింహాలు మీడియా ముసుగేసుకుని మొరిగితే.. ఎవరికి చేటు.?