Megastar Chiranjeevi Casting Couch.. తన కుమార్తెను సినీ రంగంలోకి తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా.. సినీ పరిశ్రమలో రాణించగలరు.. అని చిరంజీవి చెప్పారు.
అదీ, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా విజయోత్సవ వేడుకలో.. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చాలామందికి నచ్చాయ్.! కొంతమందికి ఆ వ్యాఖ్యలు నచ్చకపోవడంలో వింతేమీ లేదు.
చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. కుమార్తె సుస్మిత, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో మెగా నిర్మాతగా మారారు.
సుస్మిత, తొలుత కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా సినీ రంగంలోకి రావడం తెలిసిన విషయమే. నిర్మాతగా ఎదిగారిప్పుడు సుస్మిత.
చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక కూడా, సినీ రంగంలోనే వున్నారు. ఆ మాటకొస్తే, నాగార్జున మేనకోడలు, బాలకృష్ణ కుమార్తె కూడా సినీ రంగంలో వున్నారు.
అశ్వనీదత్ కుమార్తెలు నిర్మాతలుగా మారారు.. టీజీ విశ్వ ప్రసాద్ కుమార్తె నిర్మాణ రంగంలోకి వచ్చారు.. చెప్పుకుంటూ పోతే, లిస్టు పెద్దదే.
పాజిటివ్ నోట్‌లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్..
చిరంజీవి ఓ పాజిటివ్ నోట్‌లో.. సినీ పరిశ్రమలోకి మహిళలు కూడా రావాలని పేర్కొంటే, చిరంజీవి మాటలు తప్పు.. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వుందనీ, అవకాశాల పేరుతో మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ కొందరు వ్యవహారాన్ని పక్కకు తిప్పేశారు.
‘మీ టూ’ పేరుతో గతంలో పెద్ద రచ్చే జరిగింది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలు వింటూనే వున్నాం. అన్ని రంగాల్లో వున్నట్లే, సినీ పరిశ్రమలోనూ, మహిళలపై వేధింపులు వున్నాయా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
Also Read: లక్కీ లాటరీ.! రాత్రికి రాత్రే 240 కోట్లు కొల్లగొట్టేశాడు.!
తెలుగు సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం వుందని, చిరంజీవి లాంటి వ్యక్తి చెబితే.. అది ఎంతోమందికి స్ఫూర్తిగా వుంటుంది.
అసలంటూ చిరంజీవి అనే పేరు వినడానికే ఇష్టపడని కొందరు, చిరంజీవి మీద దుష్ప్రచారమే జీవిత పరమార్థంగా బతికే కొందరు.. చిరంజీవి వ్యాఖ్యల్ని వక్రీకరించడం శోచనీయం.
