Megastar Chiranjeevi Everest.. మెగాస్టార్ చిరంజీవి.. సినీ రంగంలో అయినా, సేవా రంగంలో అయినా, ఆయనకు ఆయనే సాటి. రాజకీయ రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారాయన.
అలాంటి, మెగాస్టార్ చిరంజీవి మీద ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంటుంది.? ఎందుకంటే, అదో ‘రోగం’ గనుక.! చిరంజీవి, మీడియా ముందుకొస్తే తప్పు, రాకపోతే తప్పు.!
చిరంజీవి సినిమాలు చేస్తే నేరం, చెయ్యకపోతే నేరం.! సినిమా హిట్టయినా చిరంజీవిదే తప్పు, ఫ్లాపయినా చిరంజీవిదే తప్పు.! ఎందుకింతలా కొందరు రోగిష్టుల్లా మారిపోయి, చిరంజీవి మీద ఏడుస్తుంటారు.?
Megastar Chiranjeevi Everest.. గ్రామ సింహాలు మొరిగితే, ఏనుగుకి ఏంటి నష్టం.?
నో డౌట్.. మెగాస్టార్ చిరంజీవి అంటే శిఖరం.! ఏనుగు హుందాగా నడుచుకుంటూ వెళుతోంటే, గ్రామ సింహాలు మొరుగుతుంటాయ్. చిరంజీవి విషయంలో జరిగే ట్రోలింగ్ కూడా అంతే.
తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవి. సభా మర్యాద ప్రకారం, చంద్రబాబుపై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు.

అదే సమయంలో, చిరంజీవి మీద చంద్రబాబు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ రంగంలో ఒకప్పుడు ఇద్దరూ ప్రత్యర్థులు. కానీ, ఇప్పుడైతే చిరంజీవి రాజకీయాల్లో లేరు కదా.
పైగా, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వున్నారు. చంద్రబాబు క్యాబినెట్‌లో పవన్ కళ్యాణ్ మంత్రి. టీడీపీ – జనసేన ఇప్పుడు మిత్రపక్షాలు.
అప్పట్లో జగన్‌తో కూడా..
గతంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనూ చిరంజీవికి సన్నిహిత సంబంధాలుండేవి. అప్పట్లో చిరంజీవిని పొగుడుతూ, పవన్ కళ్యా్‌ని వైసీపీ నేతలు విమర్శించేవారు. వైసీపీ క్యాడర్ కూడా అంతే.
Also Read: మహిళలు తలనీలాల్ని సమర్పించకూడదా.?
ఇప్పుడు అదే వైసీపీ క్యాడర్, చిరంజీవిని ట్రోల్ చేస్తోంది. నిజంగానే, ఇలా ట్రోల్ చేయడాన్ని ఓ మానసిక రుగ్మతగా భావించాలి. చిన్న రుగ్మత కాదు, క్యాన్సర్ కంటే భయంకరమైనది ఈ రోగం.
రక్త దానం, నేత్రదానం.. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకులు.. ఇలా సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఓ శిఖరం. అంత గొప్ప వ్యక్తిని ట్రోల్ చేయడమంటే.. అది ముమ్మాటికీ శునాకానందమే.