Megastar Chiranjeevi Helping Hand.. మెగాస్టార్ చిరంజీవి వల్ల ఎవరికీ ఉపయోగం లేదంటూ సినీ నటి రోజా మొన్నామధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
కానీ, చిరంజీవి వల్ల ఎవరికి ఉపయోగం.? అన్నది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలుసు. రక్తదానం, నేత్రదానం.. వీటికి తోడు ఆక్సిజన్ బ్యాకులు.. వెరసి, మెగాస్టార్ చిరంజీవి సాయం చేయడంలో శిఖరం.!
ఇక, రోజా మాటలంటారా.? రాజకీయాల్లో వున్నారు గనుక, ఆమె అసందర్భమే అయినా చిరంజీవిని విమర్శించాలి. లేకపోతే, రాజకీయంగా ఆమెకు మనుగడ వుండదు. ఆ విషయం చిరంజీవికీ తెలుసు.
Megastar Chiranjeevi Helping Hand.. చిరంజీవి మార్కు సాయం..
తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి అంటే ఏంటో, ఆయన వల్ల సాయం పొందిన అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది కాదు, లక్షలాది మంది వున్నారు.. ఆయన వల్ల సాయం పొందినవారు.
నోటికొచ్చింది మాట్లాడటం.. బూతులు తిట్టడం.. ఇదే రాజకీయమనుకుంటారు కొందరు.! సాయం చేయడం సేవ.. అదే, ఆ సేవ.. రాజకీయం అనుకుంటారు ఇంకొందరు.
సేవ, సాయం.. ఇది ఇప్పుడున్న రాజకీయాల్లో చెల్లదు.! ఇక్కడంతా కమర్షియల్.! ఓటుకు నోటు ఇవ్వాలి తప్ప, కష్టాల్లో వున్నోడికి సాయం చేస్తే.. రాజకీయాల్లో మనుగడ సాధించలేరు.!
Mudra369
ఎంత గొప్పోడో తెలుసా చిరంజీవి.? అని కథలు కథలుగా చెప్పుకుంటుంటారు.
తాజాగా, తనతో పాటు కొన్ని సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేసిన దేవరాజ్‌కి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు.
చెప్పుకోవాల్సిన పరిస్థితెందుకు వచ్చింది.?
ఇలాంటి సాయాలు చిరంజీవి ఎన్నో చేసినా, అప్పుడెప్పుడూ ఇంతలా బయటకు రాలేదు. ఈసారి వచ్చిందంటే, దానిక్కారణం బహుశా రోజా చేసిన విమర్శే కావొచ్చు.
‘థాంక్యూ..’ అంటూ రోజా పేరుని ట్యాగ్ చేస్తూ యంగ్ ఫిలిం మేకర్ సాయి రాజేష్ సోషల్ మీడియాలో ఓ సెటైరికల్ ట్వీటేశారు మరి.!
ఇలా ‘సాయం’ చేసే సొమ్ముని చిరంజీవి వృధా చేసుకుంటున్నారా.? సోకాల్డ్ పొలిటీషియన్లలా అయితే, చిరంజీవి అలాగే ఆలోచించి.. ఆ సొమ్ముని సాయం కోసం కాకుండా, రాజకీయాల్లో ఓట్లు కొనడానికి ఉపయోగించేవారు.
చిరంజీవికీ చేతకాలేదదని.. ఆ అన్నయ్యకి తమ్ముడైన పవన్ కళ్యాణ్‌కీ చేతకాలేదు.
అందుకే, కౌలు రైతుల కోసం కష్టార్జితాన్ని వెచ్చించి సాయం చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎక్కడ ఏ విపత్తు సంభవించినా.. లక్షలు, కోట్లు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.
ఇప్పడున్న రాజకీయాల్లో.. ఇలా చేయడం తప్పే కదా.? వాటిని ఎన్నికల సమయంలో ఓట్లను కొనేందుకు కదా ఖర్చు చేయాల్సింది.? అది చేతకావడంలేదు మెగా బ్రదర్స్‌కి.
ఔను, చిరంజీవి సొంత జిల్లాలో ఓడిపోయారు.. పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు.!
Also Read: తగ్గవయ్యా తమ్మారెడ్డీ.! పవన్ కళ్యాణ్ మీద ‘పెద్ద’ మాటలొద్దు.!
ఓట్లు కొనలేకపోవడం వల్ల సంభవించిన ఓటమిని ఓటమి అనగలమా.? అనాలి.. ఎందుకంటే, ఇది దిక్కుమాలిన రాజకీయం మరి.!