Table of Contents
Megastar Chiranjeevi ఔను కదా.! మెగాస్టార్ చిరంజీవి అంటే భయమా.? గౌరవమా.? ఈ డౌట్ ఇప్పటిదాకా ఎవరికీ రాలేదెందుకో.!
ఇంతకీ, మొన్నీమధ్యన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మంత్రి రోజా భయంతో వెళ్ళారా.? లేదంటే, గౌరవంతో కుటుంబ సభ్యుల్ని వెంటేసుకుని వెళ్ళారా.?
చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.! వస్తాయ్ మరి.. మాటలకూ చేతలకూ పొంతన లేకపోతే.. ఇలాగే వుంటుంది.
ఎందుకంటే, చిరంజీవి కుటుంబంలో చాలామంది హీరోలున్నారు కాబట్టి, వారంటే భయపడి..వాళ్ళతో గొడవ పెట్టుకుంటే అవకాశాలు రావని మాత్రమే కొందరు ఆయన వెంట తిరుగుతారన్నది మంత్రి రోజా ఉవాచ.
బ్రహ్మాజీ కౌంటర్ ఎటాక్.!
‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చెయ్యమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్టులే కదా.. అంత భయపడతారెందుకు.?’ అంటూ సీనియర్ నటుడు బ్రహ్మాజీ స్పందించాడు.
‘మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు వున్నారు.. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారు అనే ఈ చిన్న ఆర్టిస్టులు వారికి సపోర్ట్ చేస్తారు..’ అంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై బ్రహ్మాజీ స్పందన ఇది.
బ్రహ్మాజీ స్పందనను సోషల్ మీడియాలో షేర్ చేశారు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు.
నాగబాబుతో కలిసే రోజా ‘జబర్దస్త్’ అనే కామోడీ షోకి గతంలో జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
మీడియా మైకులు కనిపిస్తే ఏమైనా అనేయొచ్చా.?
మీడియా మైకులు కనిపిస్తే చాలు.. ఏమైనా అనేయొచ్చు.. అనుకుంటే ఎలా.? జనసేన యువశక్తి వేదికపై హైపర్ ఆది విమర్శలు చేశాడు గనుక, అతనికి కౌంటర్ ఎటాక్ ఇస్తే సరిపోతుంది.
పోనీ, పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలు చేస్తే.. చేసుకోవచ్చు. ఈ విషయంలో రోజాని తప్పు పట్టడానికేమీ లేదు.. అదంతా రాజకీయం.

చిరంజీవినీ, మెగా కాంపౌండ్‌నీ వివాదాల్లోకి ఎందుకు లాగినట్లు.? మెగా కాంపౌండ్ నుంచి ఒక్కరంటే ఒక్క హీరో అయినా తనను భయపెట్టినట్లు ఇప్పటిదాకా సినీ పరిశ్రమలో ఎవరూ ఆరోపించలేదు.
Megastar Chiranjeevi.. కోవిడ్ కష్టకాలంలో ఆదుకున్న చిరంజీవి..
పరిశ్రమలో కార్మికుల్ని, తోటి నటీనటుల్నీ ఆదుకునేందుకు చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయనకు పరిశ్రమ పెద్దన్న.. అనే గుర్తింపు వచ్చింది.
Also Read: వాల్తేరు వీరయ్యా.! వెళ్ళి.. నీ ‘విజేత’ చూసుకోవయ్యా.!
సొంత సొమ్ములు వెచ్చించి మరీ కార్మికుల్ని ఆదుకుంటుంటారు చిరంజీవి. అలాంటి చిరంజీవిని చూస్తే గౌరవ భావం తప్ప, భయంతో చిరంజీవి చుట్టూ జనం చేరతారనడం అవివేకం.!
మెగాస్టార్ చిరంజీవి.. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. సొంతంగా పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళారు.. రోజా, రాష్ట్ర మంత్రి అవడంతోనే.. ఇలా మీడియా ముందర అడ్డగోలుగా తూలనాడుతుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.?