Megastar Chiranjeevi Vinayak.. మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ పెద్ద హిట్స్.!
గత కొంతకాలంగా చిరంజీవి – వినాయక్ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా.. అంటూ ప్రచారమైతే జరుగుతోందిగానీ, ఏదీ మెటీరియలైజ్ కావడంలేదు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చిరంజీవి – వినాయక్ కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోందిట.
Megastar Chiranjeevi Vinayak ‘వాల్తేరు వీరయ్య’ను మించి..
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అంతకు మించిన ఎంటర్టైన్మెంట్‌తో ఓ సినిమా చేయాలని చిరంజీవి అనుకుంటున్నారన్నది తాజా ఖబర్.
ఈ నేపథ్యంలోనే వినాయక్‌తో చిరంజీవి ప్రస్తుతం డిస్కషన్స్ సాగిస్తున్నారట. కామెడీ ‘అదుర్స్’ అనేలా ఓ సబ్జెక్ట్ దాదాపు ఓకే అయ్యిందని అంటున్నారు.
Also Read: Sreeleela.. నమ్మాల్సిందే! బాలయ్యతో చాలా కొత్తగా వుంటుదట!
ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కించే అవకాశాలున్నాయని సమాచారమ్.
మరోపక్క, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా.. అంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది. అయితే, దానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు.
ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చెల్లెలిగా నటిస్తోంది ఈ సినిమాలో కీర్తి సురేష్.