Megastar Chiranjeevi Vishwambhara.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట తెరకెక్కించనున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.! రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఓ అత్యద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌తో సినిమా తెరకెక్కనుందట.!
ముల్లోకాలకూ ‘లింక్’ వుండే కథతో సినిమాని తెరకెక్కించనున్నాడట దర్శకుడు వశిష్ట.! అలాగని లీకులు వస్తున్నాయ్.!
ఇంతలోనే, ఈ సినిమాకి టైటిల్ ఫలానా.. అంటూ పలు టైటిళ్ళూ ప్రచారంలోకి వచ్చాయి. అందులో ‘విశ్వంభర’ కూడా ఒకటి.!
Megastar Chiranjeevi Vishwambhara.. లీక్ చేసిందెవరబ్బా.?
ఇంతకీ, ఈ టైటిల్ ఎవరు పెట్టారు.? టైటిల్ లీక్ అయ్యిందా.? లేదంటే, జస్ట్ గెస్ చేశారా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి, ఈ సినిమా కంటే ముందు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది.

అనివార్య కారణాల వల్ల కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు పక్కకు వెళ్ళింది. ఆ స్థానంలో వశిష్ట ప్రాజెక్టు ముందుకొచ్చింది.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ తదితర సినిమాల తరహాలో వశిష్ట – చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా వుండబోతోందని అంటున్నారు.
సంగీత మాంత్రికుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.