Megastar Kalyan Ram.. నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో హిట్టు కొట్టినట్టేనా.? ఔననే అంటున్నారు నందమూరి అభిమానులు.
నిన్ననే ‘సీతారామం’ సినిమా కూడా విడుదలయ్యింది. ఈ సినిమాకి కూడా మంచి టాక్ రావడం సినీ పరిశ్రమకు ఆనందకరమైన విషయమే కదా.?
సినిమాల సంగతి పక్కన పెడితే, ‘బింబిసార’ విడుదలయ్యాక నందమూరి అభిమానుల్లో కొందరు అత్యుత్సాహానికి గురయ్యారు. ఈ క్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్‌కి ‘మెగాస్టార్’ ట్యాగ్ తగిలించేశారు.
Megastar Kalyan Ram చిరంజీవి నుంచి లాగేశారా.?
మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ లెగసీ.! రాత్రికి రాత్రి వచ్చిన స్టార్‌డమ్ కాదది. 150కి పైగా సినిమాల్లో నటించి, తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడిగా, సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా చిరంజీవి ఎదిగారు.
తెలుగు సినీ పరిశ్రమ అంటే ఒక ఎన్టీయార్, ఓ చిరంజీవి.. ఇలా చెప్పుకోవాల్సిందే. అలాంటి చిరంజీవి (Megastar Chiranjeevi) నుంచి ‘మెగాస్టార్’ అనే ట్యాగ్‌ని దొంగిలించి మరీ, కళ్యాణ్‌రామ్‌కి అతికించేశారు.

మరీ ఇంత కక్కుర్తి ఏంటబ్బా.? పోనీ, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా కళ్యాణ్ రామ్‌కి (Kalyanram) ట్యాగ్ ఇచ్చెయ్యకపోయారా.? తాతగారి వారసత్వం అనుకోవడానికి బావుండేది.?
నటరత్న, యువ రత్న.. ఇలాంటివైనా ఇచ్చేసి వుంటే బావుండేది. ఇవేవీ కాకపోతే, యంగ్ టైగర్ అన్న ట్యాగ్ అయినా కళ్యాణ్ రామ్‌కి తగిలించేసి వుంటే బావుండేదేమో.!
కళ్యాణ్‌రామ్‌ని కామెడీ చేసేశారు.!
మొత్తమ్మీద, సక్సెస్ కొట్టిన కళ్యాణ్‌రామ్‌ని కామెడీ చేసేశారు. ఫాఫం ఆయనకి ఇవేవీ తెలిసి వుండకపోవచ్చు. తెలిసినా, ఖండించలేని పరిస్థితి.
‘బింబిసార’ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చెయ్యనీయకుండా ఆయన్ని వివాదాల్లోకి నెట్టేశారు ‘మెగాస్టార్’ (Megastar) ట్యాగ్ ద్వారా. ఇంత నీఛమా.?
Also Read: ‘లిమిట్స్’ తెలుసు.! ఆ లెక్కలూ తెలుసు: రష్మిక.!
చిరంజీవిని యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) అభిమానిస్తాడు.. ‘ట్రూ ఇన్‌స్పిరేషన్’ అని కూడా చెబుతాడు. కళ్యాణ్ రామ్ సైతం చిరంజీవి పట్ల అదే భావనతో వుంటాడు.
చిరంజీవి అయితే, చరణ్ లానే ఎన్టీయార్ (Jr NTR).. అలాగే కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) అనుకుంటారు.! ఎనీ డౌట్స్.?
మెగాస్టార్ కళ్యాణ్ రామ్ మాత్రమే ఎందుకు.? మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ రామ్ అని పెట్టేసుకోవచ్చు కదా.? చిరంజీవి అంటే ఆశీర్వచనమే మరి.!