Mental Balakrishna Akkineni Nagarjuna అహంకారం.! నరనరానా జీర్ణించుకుపోయింది.
‘పుడితే, నాలా సింహంలా పుట్టాలి..’ అని ‘స్వకుచ మర్ధనం’ చేసుకోవడం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకే చెల్లింది.
సొంత డబ్బా కొట్టుకుంటే, ఎవరూ పట్టించుకోరు. మహనీయుల్ని తూలనాడితేనే సమస్య వస్తుంది. ‘ఆ రంగారావు.. ఈ అక్కినేని తొక్కినేని..’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలతో చాలామందికి మండింది.
బాలయ్యలా నాగార్జున దిగజారాలనుకుంటే ఎంత సేపు.? ఈ విషయంలో నాగార్జున పాటిస్తున్న సంయమనం అభినందించదగ్గదే.
Mudra369
అక్కినేని కుటుంబం స్పందించింది. అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లేశారు. బాలయ్యకు ‘బుద్ధి’ చెప్పే ప్రయత్నం చేశారు.. ఆయన పేరు ప్రస్తావించకుండానే.
Mental Balakrishna Akkineni Nagarjuna.. చిన్న పిల్లలతో బుద్ధి చెప్పించుకోవడానికి సిగ్గుండాలి..
‘చిన్న పిల్లలతో బుద్ధి చెప్పించుకోవడానికి సిగ్గుండాలి కదా బాలయ్యా..’ అంటూ నాగచైతన్య, అఖిల్ ట్వీట్లపై నెటిజనం స్పందిస్తున్నారు.
నిజానికి, మాట దొర్లగానే, అది వివాదాస్పదమవగానే బాలకృష్ణ స్పందించి, ‘క్షమాపణతో కూడిన వివరణ’ ఇచ్చి వుంటే, ఆయనకే అది హుందాతనం తెస్తుంది.
కానీ, అలా చేస్తే ఆయన బాలయ్య ఎందుకవుతాడు.? ఆయన బ్లడ్డు.. బ్రీడూ వేరు.! చిత్రమేంటంటే, ఆయన్ని అభిమానించేవాళ్ళూ అలాగే తయారయ్యారు.
నాగార్జున ఏమీ పీకలేడా.?
బాలయ్య వివాదంలో నాగార్జున మౌనంగా వుండడాన్ని చేతకానితనంగా భావిస్తున్నారు నందమూరి అభిమానులు, టీడీపీ మద్దతుదారులు.

‘బాలయ్యని నాగార్జున ఏమీ పీకలేడు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా బాలయ్య (Nandamuri Balakrishna) అభిమానులు తమదైన అహంకారం ప్రదర్శిస్తున్నారు.
యధా బాలయ్య.. తథా బాలయ్య అభిమానులు.! ఇందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు.
ఆ స్వర్గీయ ఎన్టీయార్ ఘనతల్ని చెప్పుకుంటూ, బాలయ్య నోటి దురదని సమర్థిస్తూ.. తమ పైత్యాన్ని చాటుకుంటున్నారు. తొక్కినేని కాదు.. బొక్కనేని అంటూ ఎద్దేవా చేస్తున్నారు..
మరోపక్క, అక్కినేని అభిమానులూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు.. మందమూరి.. పందిమూరి..ముండమూరి.. అంటూ తిట్టిపోస్తున్నారు.
తప్పుని తప్పుగా చూడలేని మూర్ఖత్వానికి బాలయ్య అభిమానులపై జాలి పడాలా.?
Also Read: వీర సింహా రెడ్డి: బాలయ్య చెప్పిన ‘చుట్ట’ కథ.!
మరోపక్క, అన్నపూర్ణా స్టూడియోలోకి బాలయ్య ఎంట్రీని నాగార్జున నిషేధించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత.?
ఒక్కటి మాత్రం నిజం.. బాలయ్యలా నాగార్జున (Akkineni Nagarjuna) దిగజారాలనుకుంటే ఎంత సేపు.? ఈ విషయంలో నాగార్జున పాటిస్తున్న సంయమనం అభినందించదగ్గదే.