Vaibhav Suryavanshi IPL 2025.. పధ్నాలుగేళ్ళ వయసు అంటే, తొమ్మిదో తరగతి చదువుతుంటాడేమో.! ఈ రోజుల్లో క్రికెట్ అనేది చిన్నప్పటినుంచే చాలామంది పిల్లలకు అలవాటైపోతోంది.
క్రికెట్ ఓ వ్యసనం అంటారు కొందరు.! కానీ, క్రికెట్‌ని కెరీర్‌గా మార్చుకుంటున్నారు ఇంకొందరు. అలా, ఎందరో యువత క్రికెట్ పట్ల ఆకర్షితులై, క్రికెట్‌లో రాణిస్తున్నారు.
కొందరు అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదుగుతున్నారు, దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు కూడా. అలాంటివాళ్ళకి ఐపీఎల్ మంచి వేదికగా మారుతోంది.
అలా క్రికెట్‌లోకి అనూహ్యంగా దూసుకొచ్చిన ఇంకో కెరటం పేరు వైభవ్ సూర్యవంశీ. జస్ట్ పధ్నాలుగేళ్ళు మాత్రమే అతని వయసు. పాల బుగ్గల పసివాడు.. అని ప్రత్యర్థి బౌలర్లు తొలుత అనుకుని వుంటారు.
Vaibhav Suryavanshi IPL 2025.. ఇషాంత్ శర్మని ఉతికి ఆరేశాడు..
కానీ, ఇషాత్ శర్మ లాంటి సీనియర్ బౌలర్ సంధించిన బంతుల్ని, చాలా అలవోకగా స్టాండ్స్‌కి తరలించాడు వైభవ్ సూర్యవంశీ. అసలీ కుర్రాడికి భయం అన్నదే లేదాయె.!
అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే.. తొలి బంతికే సిక్సర్ బాదేశాడు వైభవ్ సూర్యవంశీ. చాలా బాగా ఆడినా, అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదన్న బాధతో ఔటయ్యాక, ఏడ్చేశాడు.
ఈసారి అలా కాదు, సెంచరీ బాదేశాడు. జస్ట్ 35 బంతుల్లోనే సెంచరీ.. ఐపీఎల్ క్రికెట్‌లో ఇంతవరకు ఏ ఇండియన్ క్రికెటర్‌కీ సాధ్యం కాని ఫీట్ సాధించేశాడు వైభవ్.

వైభవ్ సూర్యవంశీ ఆడాల్సిన క్రికెట్ చాలానే వుంది. అతన్నుంచి మనం చూడాల్సిన క్రికెట్ కూడా చాలా చాలా వుంది. ఐపీఎల్ స్థాయికి వచ్చిన వైభవ్ సూర్యవంశీకి, భారత జట్టులో స్థానం దక్కాల్సి వుంది.
బంతిని బలంగా లాగి కొట్టే క్రమంలో, వైభవ్ సూర్యవంశీ దగ్గర మంచి టెక్నిక్ కూడా కనిపిస్తోంది. ఒక ఓవర్‌లో అయితే మూడు భారీ సిక్సర్లు, మూడు బౌండరీలు బాదేశాడు వైభవ్.
Also Read: కూలీలు కాదు, శ్రామికులు.! పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.!
పవర్ అతనికి ప్లస్ పాయింట్. కొన్ని మైనస్సులు కూడా వున్నా, వాటిని కవర్ చేసుకోవడానికి బోల్డంత వయసుందీ కుర్రాడికి.
ఒక్కటి మాత్రం నిజం.. వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది.