Table of Contents
Meter Review.. యువ నటుడు కిరణ్ అబ్బవరం, తొలి సినిమా ‘రాజా వారు రాణి వారు’తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అనూహ్యంగా స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు.
ప్చ్.. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నాడు. ‘అబ్బే, ఓ పది కోట్లు లేనిదే, ఆయనతో సినిమా కష్టం’ అనే స్థాయికి వెళ్ళిపోయింది పరిస్థితి.. ఫ్లాపులొస్తున్నాగానీ.!
‘బాగా వేలు పెట్టి కేలికేస్తున్నాడట.. కథ కలగాపులగం అయిపోతోంది’ అనే విమర్శలూ కిరణ్ అబ్బవరం మీద వస్తున్నాయ్.
ఈ టైమ్‌లోనే ఈ యువ నటుడి నుంచి ‘మీటర్’ సినిమా వచ్చింది.! ఇంతకీ, ఈ మీటర్ సినిమా మేటరేంటి.!
Meter Review.. పోలీసోడు..
తండ్రి పోలీస్.! కానీ, తండ్రి ఎదుర్కొంటున్న అవమానాలు చూసి, పోలీసుగా మాత్రం అవ్వకూడదనుకుంటాడు. తండ్రేమో, తన కొడుకు గొప్ప పోలీస్ అవ్వాలని ఆశిస్తాడు.
అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అవుతాడు హీరో.! ఇక, అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది మిగతా కథ.!
మరీ అంత చులకనా.?
హోం మినిస్టర్.. ఓ మూడు వేల మంది తన మనుషుల్ని, పోలీస్ శాఖలోకి రిక్రూట్ చేస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా హీరో పేరు కూడా వెళ్ళిపోతుందట. అదేంటో.!
నేరుగా హోంమినిస్టర్‌తోనే డీల్.! ముందేమో, పోలీస్ ఉద్యోగం వదుుకోవడానికి, ఆ తర్వాత అదే ఉద్యోగం నిలుపుకోవడానికి.!

డీజీపీని హోంమినిస్టర్ చంపించేస్తాడు కామెడీగా.! ఓ సాధారణ ఎస్సై వర్సెస్ ముఖ్యమంత్రి కంటే పవర్ ఫుల్ అయిన హోం మినిస్టర్.! కాస్తంతైనా సిగ్గుండాలి ఇలాంటి స్క్రిప్ట్ రాసినందుకు.!
మాస్ మీటరు..
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కష్టపడ్డాడు. కొంత అతి చేశాడు కూడా.! కొంత కాదు, చాలా అతి చేశాడు. మాస్ స్టైల్.. అంటూ వెకిలి వేషాలేశాడు.!
హీరోయిన్ అతుల్య రవి (Athula Ravi) చేసిందేమీ లేదు. మిగతా పాత్రల గురించి మాట్లాడుకోడానికీ ఏమీ లేదు. పోసాని ఓవరాక్షన్ గురించి తప్ప.!
విలన్ అలా మెడకాయ వంచేస్తూ ఏదేదో చేస్తోంటే, మనకి మెడ పట్టేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అదేం పిచ్చి మేనరిజమో దర్శకుడికే తెలియాలి.
డీజీపిని తేలిగ్గా చంపించేసిన (ఒక డీజీపిని నేరుగా హోంమంత్రే చంపేస్తాడు), ఓ కుర్ర ఎస్సైని చంపడం పెద్ద టాస్క్ ఎందుకవుతుందన్న లాజిక్ వదిలేసిన దర్శకుడి మేధో సంపత్తికి హేట్సాఫ్ చెప్పాలంతే.
Also Read: 32 కోట్లు లాస్.! ఎన్టీయార్ ‘శక్తి’ని లాగావెందుకు దత్తూ.?
సినిమాటోగ్రఫీ బావుంది.. రెండు పాటలు కూడా ఫర్లేదు. డాన్సులు బాగానే వేశాడు. బడ్జెట్ బాగానే ఖర్చు చేశారు. ఎడిటింగ్ విషయానికొస్తే, కత్తెరకు గట్టిగానే పని చెప్పి వుండాల్సింది.
నిర్మాతలెందుకు కిరణ్ అబ్బవరం బుట్టలో పడ్డారు.? కాదు కాదు, చెత్త స్క్రిప్టుతో ఎందుకు సరిపెట్టుకున్నారు.? మొత్తానికైతే బొక్క బోర్లా పడ్డారు.!
థియేటర్‌కి వెళ్ళేంత తీరిక లేక.. ఓటీటీలో వచ్చాక కూడా చూసేందుకు తీరిక దొరక్క.. అసలు ఆ సినిమా చూడాలన్న ఇంట్రెస్టూ లేక.. ఆలస్యమయ్యింది.!
సమీక్ష అంటే, సినిమా రిలీజ్ రోజే చెయ్యాలనే నియమ నిబంధనలేవీ లేవిక్కడ.! సో, ఇదీ ‘మీటర్’ సమీక్ష.! మరీ ఓపిక, తీరిక ఎక్కువైపోతే, ఓటీటీలో చూసేందుకు జస్ట్ ట్రై చెయ్యండంతే.!