Mirai Manchu Manoj Victory.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ఔను, మంచు మనోజ్ ‘హిట్టు’ అనే మాట విని చాలాకాలమే అయ్యింది. నిజానికి, అతని కెరీర్‌లో సరైన హిట్టే లేదిప్పటిదాకా.!
నెగెటివ్ రోల్‌లోకి మారాక, ‘మిరాయ్’ సినిమాతో మంచు మనోజ్ క్లీన్ హిట్ కొట్టాడు. ‘మిరాయ్’ సక్సెస్ మామూలుగా అయితే, పూర్తిగా హీరో తేజ సజ్జ ఖాాతాలోకి వెళ్ళిపోవాలి.
అనూహ్యంగా, ‘మిరాయ్’ సక్సెస్ క్రెడిట్ కొంతమేర మనోజ్ ఖాతాలో కూడా పడింది. సినిమాలో, మంచు మనోజ్ పోషించిన పాత్ర అలాంటిది మరి.!
Mirai Manchu Manoj Victory.. నటుడిగా.. కొత్త ప్రయత్నాలు చేస్తూనే..
వాస్తవానికి, మంచు మనోజ్.. నటుడిగా చాలా చాలా ప్రయోగాలు మొదటి నుంచీ చేస్తూనే వున్నాడు. కేవలం నటుడే కాదు, సినిమాకి సంబంధించి అన్ని విభాగాలపైనా అవగాహన వున్నోడు మనోజ్.
యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చేయగలడు మనోజ్. కథ, కథనాలు స్వయంగా రాసుకోగలడు. సంగీతం మీద కూడా అవగాహన వుంది. దర్శకత్వం మీద కూడా పట్టుంది.
అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని.. అన్న చందా, ఏదీ కలిసి రాలేదు, ‘మిరాయ్’ సినిమాకి ముందు వరకూ. కానీ, ఇప్పుడు లెక్కలన్నీ మారాయ్.
కుటుంబంలో కలతల తర్వాత..
వ్యక్తిగత జీవితంలోనూ మనోజ్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఎట్టకేలకు, ఆ సమస్యలన్నీ కాస్త కొలిక్కి వచ్చాయి. ఇప్పుడీ, ‘మిరాయ్’ సక్సెస్‌తో మనోజ్ ఊపిరి పీల్చుకున్నాడు.
ఈ కొత్త ప్రయాణాన్ని మరింత అందంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంచు మనోజ్ చెబుతున్నాడు. బోల్డన్ని ఆఫర్స్ వస్తున్నాయనీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటానని మనోజ్ చెప్పాడు.
Also Read: Anushka Shetty Ghaati Review: గంజాయి స్మగ్లింగ్.. రివెంజ్ డ్రామా.!
దర్శక నిర్మాతగానూ సినిమాలు తెరకెక్కించేందుకు మనోజ్ గతంలోనే సన్నాహాలు చేసుకన్న సంగతి తెలిసిందే. వాటి విషయంలో మనోజ్, ఎప్పుడు స్పష్టత ఇస్తాడో ఏమో.!
ఒక్కటి మాత్రం నిజం.. ‘మిరాయ్’ సక్సెస్, హీరో తేజ సజ్జ కంటే మంచు మనోజ్‌కే వెరీ వెరీ స్పెషల్.!
