Mirai Ritika Nayak Red.. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది.! సినీ పరిశ్రమ అంటేనే అంత.! లక్కు ఎవరి తలుపు ఎలా తడుతుందో చెప్పలేం.!
‘మిరాయ్’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన రితిక నాయక్ గురించే ఇదంతా.! తొలి సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది రితిక నాయక్.
హీరోయిన్ రుక్సార్‌తో పోటీ పడి మరీ ఆమె చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది రితిక. నాని హీరోగా తెరకెక్కిన ‘నాన్న’ సినిమాలోనూ ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌లో రితిక నటించింది.
Mirai Ritika Nayak Red.. మిరాయ్.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.!
తేజ సజ్జ ప్రధాన పాత్రలో కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది రితిక. రెగ్యులర్ హీరోయిన్ కాదు, నటనకు ప్రాధాన్యమున్న పాత్ర.
కొన్ని చోట్ల సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది రితిక నాయక్‌కి. కానీ, ఆమె పాత్రకున్న ప్రాధాన్యత అలాంటిది మరి.!
సీరియస్ టోన్‌లోనే ‘మిరాయ్’లోని రితిక నాయక్ పాత్ర కనిపించాల్సి వచ్చింది. ఆ పాత్ర కోసం ఏమేం చేయాలో.. అన్నీ చేసింది రితిక.

తన క్యూట్ లుక్స్‌తో రితిక నాయక్ ఆకట్టుకుంది ‘మిరాయ్’ సినిమాలో. గ్లామర్ విషయంలో తానేం తక్కువ కాదని ‘వైబున్నదీ..’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్‌లో నిరూపించింది ఈ బ్యూటీ.
కాకపోతే, ఆ ‘వైబున్నదీ’ సాంగ్ మాత్రం సినిమాలో లేదు. దానిక్కారణం, సినిమాలో సీరియస్‌నెస్ తగ్గిపోతుందనే కావొచ్చు. హీరో నుంచి ఫన్ జనరేట్ అయ్యే అవకాశాలున్నాయిగానీ, హీరోయిన్ పాత్ర అలాంటిది కాదు.
Also Read: Anushka Shetty Ghaati Review: గంజాయి స్మగ్లింగ్.. రివెంజ్ డ్రామా.!
ఇక, తాజాగా ‘బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొమ్మిదో సీజన్’ తొలి వీకెండ్‌లో స్పెషల్ గెస్ట్స్‌లో ఒకరిగా సందడి చేసింది రితిక నాయక్.
హీరో తేజ సజ్జతోపాటు ‘మిరాయ్’ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా వేదికపై సందడి చేశారు.
కాగా, రెడ్ కలర్ శారీలో రితిక నాయక్.. తలతళ్లాడిపోతోంటే, కుర్రకారు గుండెలు మరింత వేగంగా కొట్టుకోవడం సహజమే కదా.!
ముందు ముందు, తెలుగు తెరపై గ్లామరస్ హీరోయిన్‌గా రితిక ఓ వెలుగు వెలిగిపోయేందుకు అవకాశాలు పుష్కలంగా వున్నాయ్.