బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో వున్న ఒకే ఒక్క హీరోయిన్.. గ్లామరస్ డాల్.. బబ్లీ బ్యూటీ ఇంకెవరో కాదు మోనాల్ గజ్జర్ (Monal Gajjar Bigg Boss Telugu 4). తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకో, ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో సరైన అవకాశాలు రాలేదన్నది నిర్వివాదాంశం.
మళ్ళీ తెలుగు తెరపై అవకాశాలు కొట్టేయడానికి ‘బిగ్ బాస్ రియాల్టీ’ షో అనేది ఓ మంచి ప్లాట్ ఫామ్ అని భావిస్తోంది మోనాల్ గజ్జర్. ఓపెనింగ్ డే ఈవెంట్‌తో ఫుల్ ఎనర్జీ చూపించిన మోనాల్ గజ్జర్, తొలి రోజే ఎమోషనల్ అవడం కొంతమందికి నచ్చలేదు.. అయితే, ఇంకొంతమంది మాత్రం ఆమె చెప్పిన విషయాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు.
హౌస్‌లో కెమెరా ముందు నిల్చుని, మళ్ళీ ఎమోషనల్ అయ్యింది. అయితే, గ్లామర్ పరంగా మాత్రం మోనాల్ గజ్జర్‌కి ఫుల్ మార్క్స్ పడిపోతున్నాయ్. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది కదా స్టైలింగ్ బాగా తెలుసు ఆమెకి. అయితే, బిగ్ హౌస్‌లో కొనసాగాలంటే, ‘గేవ్‌ు ప్లాన్’ ఖచ్చితంగా వుండాలి.
పైకి ఎమోషనల్‌గా కన్పిస్తున్నా, మోనాల్ గజ్జర్ చాలా స్ట్రాంగ్ మైండెడ్ అనే అర్థమవుతోంది. సో, ముందు ముందు మోనాల్ గజ్జర్‌ని హై ఓల్టేజ్ ఎంటర్‌టైనర్‌లా మనం చూస్తామేమో. తెలుగులో మాట్లాడం నేర్చుకోవడానికి, పదిహేను రోజుల క్వారంటైన్ పీరియడ్ ఆమెకు బాగానే ఉపయోగపడినట్లు తెలుస్తోంది.
హౌస్‌లో ఆమెకు లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది ఏమీ లేదు. పైగా, వీలైనంతవరకు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది మోనాల్ గజ్జర్. కానీ, ఎక్కువగా ఇంగ్లీషు పదాలు దొర్లేస్తున్నాయ్. ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే కాబట్టి.. ఇప్పుడే ఓ అంచనాకి వచ్చేయలేం.
కానీ, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అని మోనాల్ గజ్జర్ (Monal Gajjar Bigg Boss Telugu 4) గురించి చాలామంది బిగ్ బాస్ వ్యూయర్స్ అభిప్రాయపడుతున్నారు.