వ్యవసాయం గురించి సినిమాలు రావడం మామూలే. కొన్ని హిట్టవుతాయి, కొన్ని ఫట్టవుతాయి. పంట వేసిన రైతుకి పురుగుల, వరదల కారణంగా నష్టాలొచ్చినట్లు.. సినిమాలకు వచ్చే నష్టాల్ని పోల్చగలమా.? (Movies And Politics On Farmers And Farming) అది వేరు, ఇది వేరు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్ని రైతులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. కొందరు కాదు, రైతులందరికీ (Movies And Politics On Farmers And Farming) ఈ కొత్త చట్టాలతో నష్టమేనన్నది ఓ వాదన. అదంతా ఉత్తదే, కొందరు దురుద్దేశపూర్వకంగా ఆందోళనలు చేస్తున్నరన్నది బీజేపీ ఆరోపణ.
‘వ్యవసాయం’లో ‘సాయం’ వుందిగానీ, రైతుకు అందాల్సిన ‘సాయం’ మాత్రం అందడంలేదు. ఇంకోపక్క ‘రైతు కన్నీరు’ బాక్సాఫీస్‌కి కాసుల కనక వర్షం కురిపిస్తోంది.. రాజకీయ పార్టీలకు ఓట్లు రాల్చినట్లే. అలాగని, సినిమాల్లో రైతు కష్టాల్ని చూపించడం తప్పని కాదు.
గత ఏడాది నితిన్ హీరోగా ‘భీష్మ’ సినిమా వచ్చింది. రైతుల కష్టాల్ని జనం తెలుసుకున్నారా ఆ సినిమాతో.? అంటే, దాన్నొక కమర్షియల్ సినిమాగా మాత్రమే చూశారు. అందులో సేంద్రీయ వ్యవసాయం.. అనే కాన్సెప్ట్ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి సినిమా అవార్డుల కోసం సినిమాని పంపించేందుకు కొంత మొత్తం ఖర్చు చేసి, చేతులు కాల్చుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. తాను ఎలా మోసపోయిందీ వివరంగా పేర్కొన్నాడు.
నిజానికీ, వాస్తవానికీ ఇంత తేడా వుంటుంది. తాజాగా ‘శ్రీకారం’ అనే సినిమా.. వ్యవసాయం మీద (Movies And Politics On Farmers And Farming) రూపొందింది. హీరో శర్వానంద్.
కార్పొరేట్ కంపెనీలో అత్యున్నత స్థానంలో వుండాల్సినోడు.. వ్యవసాయం చేస్తానని వచ్చి, నానా రకాల సమస్యలూ ఎదుర్కొంటాడు. ఇంచుమించు ‘మహర్షి’ సినిమాలో కూడా ఇలాంటి పాయింట్ కనిపిస్తుంటుంది.
రైతు సమస్యల నేపథ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా వచ్చింది. ఆఫ్ బీట్ సినిమాల సంగతి సరే సరి. అన్ని భాషల సినీ పరిశ్రమల్లోనూ వ్యవసాయం గురించి సినిమాలు రావడం మామూలే. కొన్ని హిట్టవుతాయి, కొన్ని ఫట్టవుతాయి.
పంట వేసిన రైతుకి పురుగుల, వరదల కారణంగా నష్టాలొచ్చినట్లు.. సినిమాలకు వచ్చే నష్టాల్ని పోల్చగలమా.? అది వేరు, ఇది వేరు. సినిమాలకి మినిమమ్ గ్యారంటీ వుంటుందేమో.. రైతులకు అది వుండదు.
‘రెడ్ కార్పెట్ మీద నడవాల్సినవాడివి బురదలో నడుస్తానంటావేంటి.?’ అని ‘శ్రీకారం’ సినిమాలో హీరోని అడుగుతాడు ఓ పాత్రధారి. ‘బురదమయం’ అయిపోయింది వ్యవసాయం (Movies And Politics On Farmers And Farming) అంటే.
ఆ నటుడి చేత ఆ డైలాగు చెప్పించడాన్ని తప్పు పట్టలేం. వ్యవసాయం మీద తీసే సినిమాలు కూడా కాసుల పంట పండిస్తున్నాయ్.. వ్యవసాయం మాత్రం రైతుకి కూడు పెట్టలేకపోతోంది. అలాగని రైతు, వ్యవసాయం చేయడం మానేస్తే.. 130 కోట్ల మంది భారతీయులు ఏం తింటారు.?