‘సీతారామం’ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఒక్క సినిమా మృణాల్ ఠాకూర్ కెరీర్‌నే మార్చేసింది.
నిజానికి ఎప్పుడో మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే అయినా, ‘సీతారామం’ సినిమాతోనే ‘సీత’గా సరికొత్త క్రేజ్ దక్కించుకుంది.
Mrunal Thakur.. నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టమట.!
మృణాల్ ఠాకూర్ మంచి ఫుడీ అట. అన్ని రకాల ఫుడ్స్ ఇష్టంగా టేస్ట్ చేస్తుందట. ప్రాన్స్ అంటే అదేనండీ రొయ్యాంటే చాలా ఇష్టమట. అలాగే పిష్ కూడా ఇష్టంగానే తింటుందట. స్వీట్స్ అంటే పిచ్చి ప్రేమని చెబుతోందీ అందాల భామ.
స్వీట్స్‌లో ముఖ్యంగా జిలేబీ అంటే చాలా ఇష్టంగా తింటానని చెబుతోంది. తిండి విషయంలో మృణాల్‌కి ఎలాంటి అబ్జక్షన్స్ లేవట. నచ్చింది తింటుందట.

హీరోయిన్ కదా.. నచ్చింది తినేస్తే.. డ్రమ్ములా అయిపోదూ. అబ్బే.! మృణాల్ చాలా ఫిట్‌గా వుంటుంది కదా.. అదెలా సాధ్యం.? అని ఆశ్చర్యమేయక మానదు.
కానీ, ఎంత తిన్నా ఫిట్‌నెస్ విషయంలో మృణాల్ ఠాకూర్ చాలా జాగ్రత్తగా వుంటుందట. అందుకు తగిన వర్కువట్స్ రెగ్యులర్‌గా చేస్తుందట. అందుకే ఫిట్ అండ్ పర్‌ఫెక్ట్‌గా వుంటానని చెబుతోంది మృణాల్.
Also Read: అటు Megha Akash ఇటు Ashu Reddy.. మధ్యలో RGV
ఇక, హైద్రాబాదీ బిర్యానీ అంటే ప్రత్యేకమైన మమకారం అంటోంది. ఎప్పుడు హైద్రాబాద్ వచ్చినా బిర్యానీ లొట్టలేసుకుని తినేస్తుందట. ఆ టేస్ట్ అదరహో అంటోంది మృణాల్ ఠాకూర్.