Home » Pawan Kalyan.. గెలిచినోడిలో భయం.! ఓడినోడి ధైర్యం.!

Pawan Kalyan.. గెలిచినోడిలో భయం.! ఓడినోడి ధైర్యం.!

by hellomudra
0 comments
Pawan Kalyan

Pawan Kalyan.. జస్ట్ కొన్ని కిలోల బరువు గల మనిషి.! ఆయన కూడా అందరి లాంటోడే.! ఆకాశమ్మీద నుంచి ఏమీ ఊడిపడలేదు. కానీ, ఆయనలో ఏదో పవర్ వుంది.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పరిచయం అక్కర్లేని పేరిది. సినిమా నటుడిగా ఆయనకు తిరుగు లేదు. రాజకీయాల విషయానికొస్తే, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన ఓ రాజకీయ నాయకుడు.

జనసేన పార్టీని పెట్టి, పోటీ చేసిన రెండు చోట్లా తానోడి.. తన పార్టీకి ఒకే ఒక్క ఓటు సంపాదించగలిగారు పవన్ కళ్యాణ్. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎప్పుడో జనసేనను వీడారు.

Pawan Kalyan రాజకీయంగా మిస్టర్ జీరో.!

రాజకీయంగా చూసుకుంటే మిస్టర్ జీరో.. అని అంటుంటారు చాలామంది. కానీ, ఆయన చాలా మనసుల్ని గెలుచుకున్నాడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

డబ్బు రాజకీయాల్ని శాసిస్తున్నవేళ, ఆ డబ్బుతో గెలిచినోళ్ళు, ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌ని చూసి భయపడతారా.? భయపడుతున్నారు.

Pawan Kalyan

జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ వాహనాన్ని తయారు చేయించుకున్నారు.. రాజకీయ పర్యటనల నిమిత్తం ఈ వాహనాన్ని వినియోగిస్తారట.

వణుకు పుట్టిస్తున్న వారాహి..

దానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు జనసేనాని. అంతే, రాజకీయ ప్రత్యర్థులు చెలరేగిపోతున్నారు. తమ పనులు మానుకుని మరీ, వారాహి మీద ఆరా తీయడం మొదలెట్టారు.

అడ్డోలు విమర్శలు షురూ అయ్యాయ్. ఈ విమర్శలతో ఏం జరుగుతుంది.? ప్చ్.. ఏమీ జరగదు.

పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి గురించి, గెలిచినోళ్ళు తమ పనులు మానుకుని మీడియా ముందు మొరగడమంటే దాన్ని ఏమనుకోవాలి.?

గెలిచినోడికీ.. ఓడినోడికీ అదే తేడా.!

స్వార్జితంతో రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్‌కీ, జనం సొమ్ములు దోచేసి రాజకీయాలు చేసేవారికీ ఇదే తేడా.!

కష్టార్జితం ‘పవర్’ ఇస్తుంది.! దోచుకున్న సొమ్ముతో ‘పవర్’ వచ్చిందని అనుకున్నా, లోలోపల భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయం నుంచే మొరగడం అనేది మొదలవుతుంది.

Also Read: ఉద్యోగాలు పోతున్నయ్.! ‘సాఫ్ట్’గా పీకి పారేస్తున్నారంతే.!

ఆఖరికి.. దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితం వదిలేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. తిరిగి ప్రారంభించానని పవన్ కళ్యాణ్ చెబితే, అక్కడికేదో ఆ మార్షల్ ఆర్ట్స్ తమ మీద ప్రయోగిస్తారేమోనని వణికిపోయే స్థాయికి భయపడుతున్నారు కొందరు.!

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group