Mrunal Thakur Mass Romance.. ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఫేమ్ దక్కించుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే పిచ్చ పిచ్చగా క్రేజ్ కొట్టేసిన అందాల బాలీవుడ్ బొమ్మ. ఆ క్రేజ్‌తో వరుసగా ఆఫర్లు కూడా పట్టేస్తోంది.
ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది మృణాల్ ఠాకూర్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా గ్లింప్స్‌లో మృణాల్ తన క్యూట్ అప్పీల్‌తో ఆకట్టుకుంది.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మృణాల్ ఖాతాలో మరో స్టార్ హీరో చేరినట్లు తెలుస్తోంది.
Mrunal Thakur Mass Romance.. సెలెక్టివ్‌గానే సుమా.!
ఆయన మరెవరో కాదు, మాస్ రాజా రవితేజ. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్న రవితేజ, మరిన్ని కొత్త ప్రాజెక్టులు కూడా లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.

అందులో ఓ సినిమా కోసం హీరోయిన్‌గా మృణాల్ పేరును రికమెండ్ చేశాడట. క్రేజ్ వున్న హీరోయిన్స్‌తో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నాడు మాస్ రాజా రవితేజ.
అలాగే, ‘ధమాకా’ కోసం శ్రీలీలతో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేశాడు. సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మృణాల్‌తో. ఇమేజ్ ఓ రేంజ్‌లో వున్నప్పటికీ మృణాల్ సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తోంది.

ఏ కథ పడితే ఆ కథ ఒప్పేసుకోకుండా తన పాత్రకు ప్రాధాన్యత వుండేలా చూసుకుంటోంది. ఆ లిస్టులోనే మాస్ రాజా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ ప్రచారం జరుగుతోంది.
Also Read: తేజ్ యాక్సిడెంట్.! ఆ భయం పవన్‌ని వెంటాడుతోంది.!
అన్నట్టు, అడల్ట్ సిరీస్ అయిన ‘లస్ట్ స్టోరీస్ 2’లోనూ మృణాల్ నటించిన సంగతి తెలిసిందే. ఓటీటీ కంటెంటే కదా అని అక్కడ కూడా హద్దులు దాటేయకుండా లిమిట్స్‌లోనే పర్‌ఫామ్ చేసి, మెప్పించింది మృణాల్ ఠాకూర్.