Mrunal Thakur Movies… ‘సీతారామం’ సినిమా తర్వాత ఈ పేరు తెగ మార్మోగిపోయింది. అప్పటికే బాలీవుడ్‌లో మృణాల్ సుపరిచితురాలైనప్పటికీ ఈ సినిమా తర్వాత ఆమె ఇమేజ్ కంప్లీట్‌గా మారిపోయింది.
తొలి తెలుగు సినిమా ‘సీతారామం’ బ్యూటీగా తెలుగు ప్రజల హృదయాల్ని కొల్లగొట్టేసిన మృణాల్, ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తోంది.
ఏది పడితే అది కాదనీ కంటెంట్ వున్న సినిమాలనే ఎంచుకోవాలని అందాల భామ మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur) అనుకుంటోందట.

ఏమాత్రం తొందరపడకుండా, లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తానంటోంది అందుకేనేమో. కొత్త సినిమాల విషయంలో కాస్త టైమ్ తీసుకుని తెలివిగా స్టెప్ వేస్తోంది. ప్రస్తుతం తెలుగులో నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేస్తోంది.
Mrunal Thakur Movies.. ‘సీతారామం’ క్రెడిట్‌తోనే..
ఈ సినిమా ఈ కథ తనను బాగా ఇంప్రెస్ చేసిందంటోంది మృణాల్ ఠాకూర్. కొత్త దర్శకుడు శౌర్యవ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ కథగా ఈ సినిమా రూపొందుతోంది. నాని వంటి నేచురల్ స్టార్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా వుందంటోంది మృణాల్ ఠాకూర్.
Also Read: గేమ్ ఛేంజర్ కాదు, దిల్ రాజు ఫిట్టింగ్ మాస్టర్.!
అలాగే, బాలీవుడ్‌లోనూ ‘సీతారామం’ తర్వాత మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయట మృణాల్‌కి. బాలీవుడ్‌లో టెలివిజన్ నటిగా పాపులరైన మృణాల్ (Mrunal Thakur) ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
పర్సనల్ ట్రాజెడీ..
కెరీర్ మొదట్లో సరైన అవకాశాల్లేక, కెరీర్ అగమ్యగోచరంగా మారిపోయిందనీ, ఆ టైమ్‌లో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
ఓ దశలో సూసైడ్ ఆలోచనలు చేశాననీ తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన ట్రాజెడీ గురించీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.

ఇదిలా వుంటే, ‘సీతారామం’ సినిమా తర్వాత కెరీర్‌పై మళ్లీ ఆశలు చిగురించాయనీ, ప్రస్తుతం మూడు నాలుగు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా వున్నానని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).
అందులో భాగంగానే మృణాల్ నటించిన ‘గుమరాహ్’ అను హిందీ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదో ధ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో మృణాల్ పోలీస్ పాత్రలో ఆకట్టుకుంది.