Home » మృణాల్ ఠాకూర్: ప్రేమికుల రోజు.. అంటే, ఆల్ ఫూల్స్ డే.!

మృణాల్ ఠాకూర్: ప్రేమికుల రోజు.. అంటే, ఆల్ ఫూల్స్ డే.!

by hellomudra
0 comments
Mrunal Thakur

Mrunal Thakur Valentine.. అసలు ‘ప్రేమికుల రోజు’కీ, ‘ఆల్ ఫూల్స్ డే’కీ ఏమన్నా లింకుందా.? ప్రేమికుల రోజు అంటే, ఫిబ్రవరి 14. దాన్నే వాలెంటైన్స్ డే.. అంటాం.!

ఇక, ఆల్ ఫూల్స్ డే.. అంటే, అది ఏప్రిల్ 1న వస్తుంది.! అదో సరదా వ్యవహారం. ప్రేమికుల రోజు.. అది వేరే లెక్క.!

ప్రేమికుల రోజుని ఆల్ ఫూల్స్ డే.. అని పేర్కొనడం ఒకింత ఆశ్చర్యకరమే. అలా పోల్చింది ఎవరో కాదు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

మృణాల్ ఠాకూర్, నటుడు ధనుష్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనీ, ఇద్దరూ డేటింగులో వున్నారనీ, ఫిబ్రవరి 14న ఈ ఇద్దరూ తమ పెళ్ళి విషయమై స్పష్టత ఇస్తారనీ.. గాసిప్పులు గుప్పుమన్నాయ్.

ఈ వ్యవహారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ స్పందించక తప్పలేదు. అసలిలాంటి గాసిప్స్ ఎలా పుడతాయో అర్థం కావడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిందీ ముద్దుగుమ్మ.

ఫిబ్రవరి 14 అంటే, అది ఏప్రిల్ 1 కిందనే లెక్క.. నా వరకూ.! అంటూ, ‘డేటింగ్ రూమర్స్’కి సమాధానమిచ్చే క్రమంలో మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యానించింది.

‘నా ఉద్దేశ్యం ప్రేమికుల రోజుని తక్కువ చేసే ఉద్దేశ్యం కాదు. నా వరకూ నేను, ప్రేమ అలానే పెళ్ళి విషయంలో క్లారిటీతో వున్నాను. ఈ రూమర్స్ ఒకింత బాధించాయి..’ అని చెప్పింది మృణాల్ ఠాకూర్.

ఫిబ్రవరి 14న నా నుంచి ధనుష్‌తో ప్రేమతో ప్రకటన వస్తుందని ఎవరైనా నమ్మితే, వాళ్ళంతా ఆ రోజు ఫూల్స్ అవుతారని మృణాల్ తేల్చి చెప్పింది.

ధనుష్ సహ నటుడేననీ, అంతకు మించి అతనితో ప్రత్యేకమైన రిలేషన్‌షిప్ ఏమీ లేదని మృణాల్ ఠాకూర్ స్పష్టతనిచ్చేసింది.

తెలుగులో ‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తోంది మృణాల్.

అన్నట్టు, మృణాల్ ఠాకూర్‌తో ఓ తెలుగు హీరోకి కూడా లింకులు పెట్టి, గతంలో గాసిప్స్ ప్రచారం చేసేశారు కొందరు. ఇదొక నిరంతర ప్రక్రియ అంతే.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group