ముంబై ఇండియన్స్ (Mumbai Indians Enters Finals) జట్టు.. ఈ సీజన్ ఐపీఎల్ టోర్నీని ఎగరేసుకుపోవడానికి ఒక్క అడుగు దూరంలోనే వుంది. క్వాలిఫైర్ వన్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని చిత్తు చిత్తుగా ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ బిగినింగ్ అదిరిపోయినా.. ఒక్కసారిగా ఆటలో వేగం తగ్గిపోయింది.. దానిక్కారణం వరుసగా ముంబై వికెట్లు కోల్పోవడమే. అయితే, చివర్లో మాత్రం హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ దుమ్ము రేపేశారు. దాంతో 200 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో.
201 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, ఒక్క పరుగు కూడా చేయకుండానే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ బోర్డ్ నెమ్మదిగా నడిచింది.
ఏ దశలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ని గెలిచేందుకు ఆడినట్లు కనిపించలేదు. అలాంటి అవకాశమే ముంబై బౌలర్లు, ఢిల్లీ క్యాపిటల్ బ్యాట్స్‌మెన్‌కి ఇవ్వలేదు. అక్సర్ పటేల్, స్టోయినెస్ కాస్సేపు బౌండరీలతో అలరించడం మినహా ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవడానికేమీ లేదు.
బుమ్రా, బంతితో నిప్పులు చెరిగేయడంతో ముంబై ఇండియన్స్ జట్టుకి మంచి విజయం దక్కింది. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఇప్పటికే ఫైనల్ చేరుకున్న ముంబై ఇండియన్స్ జట్టు, నాలుగు సార్లు టైటిల్ అందుకుంది. ముంబై జట్టు ఫైనల్‌కి చేరడం ఇది ఆరోసారి. ముంబై జోరు చూస్తోంటే, ఈ సీజన్‌ని సైతం గెల్చుకోవడం దాదాపు ఖాయంగానే అన్పిస్తోంది.
ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్ ఇస్తున్న ముంబై జట్టు (Mumbai Indians Enters Finals) కాక, ఈ సీజన్ విజేత అయ్యే అర్హత ఇంకెవరికి వుంది.? అన్నది ముంబై అభిమానుల వాదన. కాగా, కరోనా నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్, యూఏఈలో జరుగుతోంది. ప్రేక్షకులు లేకుండా జరుగుతోన్న ఈ క్రికెట్.. ఐపీఎల్ హిస్టరీలోనేకాదు, ప్రపంచ క్రికెట్ హిస్టరీలోనే చాలా చాలా ప్రత్యేకమైనది.