Mummy Cat Baby Monkey.. పంది కడుపున ఏనుగు పుట్టిందట.. గొర్రె కడుపున మనిషి పుట్టాడట.. ఇలా చాలానే వింటుంటాం.!
మనిషికి ఏనుగు తలను అతికించాడు పరమశివుడు.. అలా వినాయకుడు అవతరించాడు. నిజ జీవితంలో ఇది సాధ్యమేనా.?
అవయవ మార్పిడి జరుగుతోంది.. వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణల్ని చూస్తున్నాం.! సింహాన్నీ, పులినీ కలిపేసి.. ‘లైగర్’ని తయారు చేసేశాం.
సో, ముందు ముందు ఏదైనా సాధ్యమే.! కానీ, ఇప్పుడైతే ఓ వింతను చూసేద్దాం.!
Mummy Cat Baby Monkey.. తల్లి పిల్లి.. పిల్ల కోతి.!
ఓ పిల్లి కడుపున కోతి.. అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మామూలుగా అయితే, పిల్లిని కోతి ఆటపట్టిస్తుంటుంది. కోతి పిల్లని అయితే పిల్లి చంపేసి, తినేయగలదు కూడా.!
అయితే, ఇక్కడ వ్యవహారం వేరే. ఓ పిల్లి, ఓ కోతి పిల్లని తల్లిలా చూసుకుంటోంది. ఆ కోతి పిల్ల కూడా పిల్లిని తన కన్నతల్లిలా భావిస్తోంది.
అచ్చం తన తల్లిని ఎలాగైతే పట్టుకుని వుంటుందో.. అలాగే పిల్లిని గట్టిగా పట్టుకుంటోంది.. తనను గట్టిగా పట్టుకున్న కోతి పిల్లతో.. పిల్లి ఎంచక్కా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.?’ అంటూ ఓ తెలుగు పాటొకటుంటుంది.
Also Read: టైటానిక్ విషాదం! ఐదుగుర్ని మింగేసిన ఓసియన్ గేట్ ‘టైటాన్’!
ఔను, కడుపున పుట్టకపోయినా, కోతి పిల్లని ఆ పిల్లి తన బిడ్డలానే చూసుకుంటోంది. కోతి పిల్లకు తన చనుబాలు ఇస్తోంది.. తల్లిలా ఆప్యాయతనీ పంచుతోంది.
సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేసుకుంటున్న దారుణాల్ని మానవ జాతిలో చూస్తున్నాం.! అలాంటోళ్ళని జంతువులతో పోల్చుతుంటాం.
ఇప్పుడు చెప్పండి, మనిషిని.. జంతువులతో పోల్చవచ్చా.? పోల్చకూడదా.?
ఇక, మేక కడుపున మనిషి ఆకారం పుట్టడం.. పంది కడుపున ఏనుగు ఆకారం జన్మించడం.. ఇవన్నీ, జన్యుపరమైన సమస్యల కారణంగా జరుగుతాయ్.!
పైన చెప్పుకున్నట్లు, క్రాస్ బ్రీడ్ టెక్నాలజీ వల్ల.. భవిష్యత్తులో ‘జన్యుపరమైన కారణాలతో’ కాకుండానే, అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకోనున్నాయ్.
కాదేదీ కవితకనర్హం.. అంటాడో కవి.! సరోగసీ.. దీని గురించి వింటున్నాం కదా.! ఏం, మనుషుల్లోనే ఎందుకు.? జంతువుల గర్భాల్లో సరోగసీ ఎందుకు ట్రై చేయకూడదన్న ఆలోచన వస్తేనో.!