Imanvi Fauzi Food Prabhas.. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్.. అనగానే, ముందుగా గుర్తుకొచ్చేది.. అతిథి సత్కారం.! సత్కారం అంటే, అందులో మళ్ళీ భోజనమే హైలైట్.!
ప్రభాస్తో ఏ హీరోయిన్ పని చేసినాసరే, ‘తిండి పెట్టి చంపేస్తాడు..’ అని సరదాగా ఆయా హీరోయిన్లు చెబుతుంటారు. తెలుసు కదా, ప్రభాస్ భోజన ప్రియుడని.!
రకరకాల ఆహార పదార్థాల్ని ఇష్టంగా ఆరగిస్తుంటాడు ప్రభాస్.! అయినాసరే, సినిమా కోసం ఫిట్ అండ్ పెర్ఫెక్ట్గా మారిపోతుంటాడు.. అది వేరే చర్చ.
అదే సమయంలో, ప్రభాస్ ఈ ‘భోజన ప్రియత్వం’ వల్ల అనేకానేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాడనే గాసిప్స్ సంగతి సరే సరి.
తాజాగా, ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి భోజనం పంపించాడు ప్రభాస్. ఆ భోజనాన్నే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ‘మనసు, పొట్ట.. రెండూ నిండిపోయాయ్..’ అంటూ పేర్కొంది ఇమాన్వీ.
దాదాపు 30 రకాల ఆహార పదార్థాల్ని ఇమాన్వీకి పంపించాడు ప్రభాస్. అందులో నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాలా.? ఆ మాటకొస్తే, అన్నీ నాన్ వెజ్ ఐటెమ్సే వున్నాయ్.
ఇవన్నీ మనుషులు తినేవేనా.? అన్న డౌట్ మీకొస్తే.. అది మీ తప్పు కానే కాదు.! నిజమే, ఓ సాధారణ మనిషి ఒకేసారి ఇంత భోజనాన్ని తినేసే అవకాశమే లేదు.
కాకపోతే, రాచమర్యాదలు ఇలాగే వుంటాయ్ మరి.! ప్రభాస్ రాజు కదా.. అందుకే, ఆ రాచ మర్యాదలకు ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటుంటాడు.
చక్కనమ్మ చిక్కితేనే అందం.! కాదు కాదు, బొద్దుగా వున్నా కూడా అందమే.! ఇవన్నీ ఆరగించేసి ఇమాన్వీ, ఫిట్నెస్ని ఎలా కాపాడుకుంటుందో ఏమో.!
మంచి డాన్సర్ కదా.. ఏం ఫర్లేదు.. ఫుల్లుగా భుజించేసి, ఆ తర్వాత డాన్స్ చేస్తూ చేస్తూ.. వుంటే, తిండితో వచ్చిన ఫ్యాట్.. ఖర్చయిపోతుంది.