Naalugo Pellaam Savathi Poru.. కార్లను మార్చినట్లు భార్యల్ని మార్చుతారు.! ఇంకా నయ్యం, నిన్న మొన్నటిదాకా అయితే, భార్యల స్థానంలో ‘పెళ్ళాలు’ అంటూ నోటికొచ్చింది వాగేవాడాయన.!
ఎవరు.? అనడక్కండి.! అది అప్రస్తుతం. ఉన్నత పదవుల్లో వున్న వ్యక్తులు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
మహిళలకు సంబంధించిన ఓ బహిరంగ సభలో, ‘కార్లను మార్చినట్లు భార్యల్ని మార్చుతాడు..’ అంటూ రాజకీయ ప్రత్యర్థి మీద సెటైర్లేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
Naalugo Pellaam Savathi Poru.. ఈ సవతి గోలేంటి.?
సదరు కార్యక్రమానికి హాజరైన మహిళలు, ‘ఈయనేంటి.. మహిళా సమస్యల గురించి మాట్లాడకుండా, మహిళల్ని కార్లతో పోల్చుతాడేంటి.?’ అని గుస్సా అయ్యారు.
డబ్బులిచ్చి జనాన్ని తోలుకెళ్ళి, ఎవరో రాసిచ్చిన పేపర్ స్లిప్ చూసి చదివి.. అందులోని నీఛాతి నీఛమైన రాతల్ని నిస్సిగ్గుగా చదివి తన పరువుని తానే తీసుకుంటున్నాడా ప్రబుద్ధుడు.
‘నలుగురు నలుగురు పెళ్ళాలు..’ అని గతంలో ఇదే ప్రబుద్ధుడు చేసిన విమర్శలకి అట్నుంచి కౌంటర్ ఎటాక్ గట్టిగానే పడింది.
‘నా నాలుగో పెళ్ళానివి నువ్వే.. రా’ అంటూ ఒళ్ళు మండి అవతలి వ్యక్తి చేసిన కౌంటర్ ఎటాక్‌తో కూడి బుద్ధి రాలేదు ఈ ప్రబుద్ధుడికి.
నాలిక మందం కావడంతో, నోరు తిరగదాయె.. దానికి తోడు, తోలు మందం కాబట్టి, అట్నుంచి చెర్నాకోల్‌తో కొట్టినట్లుగా కౌంటర్ ఎటాక్స్ పడుతున్నా, బుద్ధి రావట్లేదు.
డౌటానుమానాలు పెరుగుతున్నాయ్.!
మామూలుగా అయితే, ‘నాలుగో పెళ్ళాం’ కామెంట్ తర్వాత, సదరు ప్రబుద్ధుడి నుంచి, ‘కార్లు, పెళ్ళాలు’ అనే మాట రాకూడదు. కానీ, ఇంకోసారి వచ్చింది.
సో, విషయం సుస్పష్టం. నాలుగో పెళ్ళానిది సవతి పోరు… అని జనం అనుకోవాల్సి వస్తోంది.!
రాజకీయం అన్నాక కొందరు నాయకులు దిగజారిపోతుంటారు. దిగజారిపోవడంలో ఇది వేరే లెవల్. రాజకీయ విమర్శలు చేసే విషయంలో, ఈ సింగిల్ సింహం.. తన మగతనానికి తానే సవాల్ విసురుకుంటుండడం కొసమెరుపు.
Also Read: Lahari Shari Butterfly Tattoo: పచ్చబొట్టు సౌందర్య ‘లహరి’.!
నాలుగో పెళ్ళాం సవతి తీరు చూశాక.. సింగిల్ సింహం.. ‘మగతనం’పై అందరికీ డౌట్లు రావడం సహజమే కదా.? అన్నది రాజకీయ ప్రత్యర్థుల కౌంటర్ ఎటాక్.!
గమనిక: పనిగట్టుకుని ఎవర్నో ఉద్దేశించిన రాత కాదిది.! దయచేసి, గుమ్మడికాయల దొంగలెవరూ భుజాలు తడుముకోవద్దని మనవి.!