Nabha Natesh Vacation Glamour.. నభా నటేష్ గుర్తుందా.? ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. అంటే, ఇట్టే గుర్తుకొచ్చేస్తుందెవరికైనా.!
తెలుగులో చాలా సినిమాలే చేసినా, ‘ఇస్మార్ట్ భామ’ అనే ఐడెంటిటీ ఫిక్సయిపోయింది నభా నటేష్‌కి.

ఆ మధ్య ఓ సర్జరీ కారణంగా, సినిమాలకు కాస్త దూరమైన ఈ బ్యూటీ, ఇప్పుడిప్పుడే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతోంది. వాటిల్లో కొన్ని రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయ్ కూడా.
సినిమాల సంగతెలా వున్నా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ, అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ.. తన పాపులారిటీని పెంచుకుంటూ వెళుతోంది నభా నటేష్.

తాజాగా, ‘ఫొటో డంప్’ అంటూ, న్యూజిలాండ్ వెకేషన్ తాలూకు ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ అందాల భామ.!
చూస్తున్నారు కగా.. ప్రకృతిలో ఇస్మార్ట్ బ్యూటీ మమేకమవుతున్న తీరు.! ఎక్కడికెళ్ళినా, అక్కడి ప్రకృతి అందాలకు, తనదైన గ్లామర్‌ని అద్దుతున్నట్లుంది నభా నటేష్‌ని చూస్తోంటే.

బాల్కనీలో బాత్ టబ్బులో.. ప్రకృతిని ఆస్వాదిస్తోన్న నభా నటేష్.. నెట్టంట వైరల్‌గా మారింది. మంచు కొండల్లో ఇస్మార్ట్ బ్యూటీ గ్లామర్.. అది వేరే లెవల్ అంతే.
పొట్టి నిక్కరేసుకున్న పెద్ద పాపా.. అంటూ, కొన్ని ఫొటోల్లో నభా నటేష్‌ని చూసిన నెటిజనం కామెంట్లు చేస్తున్నారు.!

ఫుడీ అయిన నభా నటేష్, నచ్చిన ఆహారం తింటూ పరవశానికి లోనవుతున్న వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!

అందాల భామల వెకేషన్.. అంటే, ఆ ఫొటోల్లోని వాళ్ళ గ్లామర్‌కి స్పెషల్ ఫోకస్ వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.! అందం చూడవయా.. ఆనందించవయా.!
