సినీ జంట అక్కినేని నాగచైతన్య, సమంత (Naga Chaitanya Samantha Divorce) తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఇద్దరం వేర్వేరు దారుల్లో పయనించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రేమించి, పెళ్లి చేసుకుని అర్ధాంతరంగా ఇలా వైవాహిక జీవితానికి ముగింపు పలికిన తొలి సినీ జంట ఇదే కాదు. ఇదే ఆఖరు జంటా కాదు. జరుగుతుంటాయ్. అదంతే.
సమంత, చైతన్య ఇద్దరూ కలిసి ‘ఏ మాయ చేశావె’ సినిమాలో తొలిసారిగా నటించారు. సమంతకి అదే తొలి తెలుగు సినిమా. అప్పుడే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. కానీ, చాలా కాలం ఇద్దరి మధ్యా రహస్య ప్రేమ నడిచిందట. చివరికి ఈ ఇద్దరూ ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ముచ్చటైన జంట అనే ప్రశంసలూ ఈ జంట నిన్న మొన్నటి దాకా అందుకుంటూనే ఉంది.
Also Read: Samantha.. ఇప్పుడెవరు సిగ్గుపడాలి.?
కొన్నాళ్ల క్రితమే, తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ‘అక్కినేని’ అనే పేరును తొలగించింది సమంత. దాంతో పాటుగా సమంత పేరు లేకుండా ‘ఎస్’ అనే అక్షరాన్ని మాత్రమే ఉంచింది. అప్పుడే చాలా మందికి చాలా అనుమానాలొచ్చాయి.
‘లవ్ స్టోరీ’ ప్రమోషన్లలో భర్తకు తోడుగా సమంత కనిపించకపోయేసరికి చాలా మంది అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇప్పుడిక అంతా క్లియర్. ఇంతకీ, సమంత, నాగ చైతన్య మధ్య వైవాహిక జీవితం ముందుకు సాగని పరిస్థితి ఎందుకొచ్చింది.?
నాగ చైతన్య, సమంత.. ఈ ఇద్దరికీ వారి వారి కోణంలో బలమైన కారణాలు ఉండి ఉండొచ్చు. సెలబ్రిటీలు కాబట్టి, వాళ్ల జీవితాల్లోకి తొంగి చూడొచ్చు.. అని ఎవరైనా అనుకుంటే, అది సబబు కాదు. కలిసి జీవించాలనుకున్నారు. కుదరలేదు. విడిపోతున్నారు. అంతే. కొత్త జీవితం విడివిడిగా ఇద్దరూ ఖచ్చితంగా ప్రారంభిస్తారు. అందులో సందేహం అనవసరం. వాళ్ల జీవితాలు వాళ్ల ఇష్టం.
Also Read: సూటిగా, సుత్తి లేకుండా.. దటీజ్ సమంత
కానీ, సోషల్ మీడియాని ఎవ్వరూ శాసించలేరు కదా.. ట్రోలింగ్, విపరీతమైన ట్రోలింగ్, భయంకరమైన, జుగుప్సాకరమైన ట్రోలింగ్ కొన్నాళ్ల పాటు జరుగుతూనే ఉంటుంది. ఈ సోషల్ పోస్టుమార్టంలో ఏవేవో కథనాలు వస్తుంటాయి. ఇవే వీళ్లిద్దరూ విడిపోవడానికి (Naga Chaitanya Samantha Divorce) కారణం.. అంటూ వచ్చే ఆ కథనాల విశ్వసనీయత ఎంతనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.