Naga Chaitanya Slams Balakrishna.. సాధారణంగా సోషల్ మీడియా వేదికగా ఎలాంటి వివాదాస్పద అంశాలకూ తావివ్వడు నాగచైతన్య.! వేదికల మీద మాట్లాడేటప్పుడు కూడా హుందాగా వ్యవహరిస్తాడు.
సమంతతో విడాకుల నేపథ్యంలో ఎంత ట్రోలింగ్ జరిగినా, అక్కినేని నాగచైతన్య సంయమనం పాటించాడు. సమంత మాటల్లోనూ నాగచైతన్య ప్రస్తావన వచ్చినా, నాగచైతన్య ఎక్కడా హద్దు దాటలేదు.
కానీ, తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విషయంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని ఖండించక తప్పలేదు అక్కినేని నాగచైతన్యకి.!
ANR Lives On..ఏయన్నార్‌ని అవమానించొద్దు..
నందమూరి తారక రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, ఎస్వీ రంగారావుగారు తెలుగు కళామతల్లి బిడ్డలు..
వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరచుకోవడం..
అంటూ సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ట్వీటేశాడు.

తెలుగులో కొందరికి అర్థం కావొచ్చు.. కాకపోవచ్చనుకున్నాడేమో..
Nandamuri Taraka Rama Rao garu, Akkineni Nageswara Rao garu and SV Ranga Rao Garu’s creative contributions have been pride and pillars of Telugu Cinem.
Disrespecting them is degrading ourselves..
అని ఇంగ్లీషులో కూడా వాతలెట్టాడు అక్కినేని నాగచైతన్య.
Naga Chaitanya Slams Balakrishna.. ఎంతటి హుందాతనమిది.?
వేదికలెక్కి మైకులు చేతిలో వుంటే.. వాటిని ఎగరేసి స్టైల్ చూపించాలనుకునేవారు కొందరుంటారు. అలాంటోళ్ళు ‘ఆ రంగారావు.. అక్కినేని.. తొక్కనేని’ అంటూ వెకారాలు చేయడంలో వింతేముంది.?
అలాంటివాళ్ళని ఉద్దేశించే, అత్యంత హుందాతనంతో కూడిన ట్వీటేశాడు అక్కినేని నాగచైతన్య.
కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అనే స్థాయిలో కౌంటర్ ఎటాక్ ఇవ్వాలనుకుంటే, ‘నందమూరి.. ముండమూరి..’ అనాలి. నాగచైతన్య అలా చేయలేదు.
Also Read: ‘వాల్తేరు వీరయ్య’ మెగాస్టార్ చిరంజీవి ‘టూ పాయింట్ ఓ’.!
ఎంతైనా, సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బ్లడ్డూ.. బ్రీడూ వేరు.! కాబట్టే, ‘ఆ రంగారావు.. ఈ అక్కినేనీ తొక్కినేనీ..’ అంటూ పలచని మాటలు బాలయ్య మాట్లాడాడు.
కాగా, అక్కినేని అభిమానులు మాత్రం ఇంకొంచెం ‘డోస్’ పెంచాలంటున్నారు. ప్చ్.! నాగచైతన్య అంతలా తన స్థాయిని దిగజార్చుకోవాలనుకోలేదు. ఈ విషయంలో నాగచైతన్యని అభినందించి తీరాల్సిందే.
ఇంతకీ, బాలయ్య (Nandamuri Bala Krishna) ‘క్షమాపణ’ చెప్తాడా.? లేదంటే, అక్కినేని నాగార్జున కూడా రంగంలోకి దిగాలా.?
అన్నట్టు, స్వర్గీయ ఎస్వీ రంగారావు అలాగే స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుపై అభ్యంతకర రీతో వెటకారాలు చేసినందుకుగాను ‘మెంటల్ బాలకృష్ణ’ (Mental Bala Krishna) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.